‘రంగస్థలం’ తరువాత సుకుమార్ మైత్రీ మూవీస్ తోనే మరొక సినిమా చేయవలసిన ఎగ్రిమెంట్ ఉండటంతో ఆమూవీ మహేష్ తో తీయాలని మైత్రీ మూవీస్ సంస్థ చాల గట్టి ప్రయత్నాలు చేసింది. ఈ ప్రయత్నాలలో భాగంగా సుకుమార్ మహేష్ కు ఎన్ని కథలు చెప్పినా ఏ కథకు మహేష్ నుండి ఫైనల్ అంగీకారం రాకపోవడంతో అసలు ఈ ప్రాజెక్ట్ ముందుకు వెళుతుందా లేదా అన్న అనుమానాలు సుకుమార్ కు రోజురోజుకు పెరిగిపోతున్నట్లు టాక్.  
Mahesh Babu and Sukumar
దీనితో సుకుమార్ లో తీవ్ర అసహనం పెరిగిపోతున్నట్లు తెలుస్తోంది. సుకుమార్ సినిమాలలో హీరోలకు ఉండే బాడీ లాంగ్వేజ్ కాకుండా మరో డిఫరెంట్ బాడీ లాంగ్వేజ్ తో తనను చూపెట్టమని మహేష్ కోరడంతో పాటు తన పాత్ర ‘పోకిరి’ ‘దూకుడు’ సినిమాల రేంజ్ లో ఉండాలని మహేష్ కోరుతూ ఉండటంతో మహేష్ సూచనలకు అనుగుణంగా అతడికి పూర్తిగా నచ్చే స్క్రిప్ట్ ను సుకుమార్ అందివ్వలేక పోతున్నాడని తెలుస్తోంది. 
mahesh sukumar project latest update
దీనితో మహేష్ అంగీకారం కోసం ఎదురు చూసే బదులు తన నిర్మాణ భాగస్వామ్యంలో తయారు అవుతున్న చిన్న సినిమాల విషయం పై ఎక్కువగా సుకుమార్ దృష్టి పెడుతున్నాడని తెలుస్తోంది. దీనికితోడు ఈమధ్య మహేష్ ‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత అనీల్ రావిపూడిని తన వద్దకు పిలిపించుకుని కథలు చెప్పమని కోరడం కూడ సుకుమార్ కు తీవ్ర అసౌకర్యంగా మారినట్లు టాక్.
Mahesh Babu and Sukumar
 సుకుమార్ మైత్రీ సంస్థ నిర్మాతలకు మహేష్ కథ ఫైనల్ చేసే విషయంలో తనకు మరో 6 నెలలు సమయం కావాలని అడుగుతూ తాను కూడ మహేష్ లాగే ఈ మూవీ ప్రాజెక్ట్ ఉంది అని కానీ లేదు అని కానీ అనకుండా వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనితో కన్ఫ్యూజ్ అవుతున్న మహేష్ అనిల్ రావిపూడి కథ వైపు అడుగులు వేస్తూ అతడు కూడ సుకుమార్ ను పెండింగ్ లో పెడుతున్నట్లు ఇండస్ట్రీ వర్గాలలో వార్తలు హడావిడి చేస్తున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: