నాగార్జున.. నిన్న మొన్నటి వరకూ తెలుగులోని నలుగురు టాప్ హీరోల్లో ఒకరు. దశాబ్దాలపాటు ఆ స్థానంలో కొనసాగారు. ఇప్పుడు ఆయన కొడుకులు కూడా హీరోలైపోయారు. ఓ టాప్ హీరోయిన్ కోడలుగా వచ్చేసింది.

Image result for hero nagarjuna assets


నాగార్జున కేవలం సినిమాల్లో నటించడం ద్వారానే కాదు.. ఆయనకు ఎన్నో వ్యాపారాలు ఉన్నాయి. చిత్ర నిర్మాణంతో పాటు కన్‌స్ట్రక్షన్ రంగంలోనూ పెట్టుబడులు ఉన్నాయి. సినీ నిర్మాణం సంగతి సరే సరి. వీటితో పాటు ప్రకటనల్లోనూ ఆయన బాగానే నటిస్తారు.

Related image


మరి ఇవన్నీ కలుపుకుంటే.. నాగార్జున ఆదాయం ఎంత.. ఆయన ఆస్తి పాస్తులెన్ని.. ఈ అంశంపై జూమ్ టీవీ ఓ కథనం ప్రసారం చేసింది. దీని ప్రకారం నాగార్జున ఏడాదికి 30 కోట్ల రూపాయల వరకూ సంపాదిస్తున్నారట.

Related image

అంతే కాదు.. మొత్తం నాగార్జున ఆస్తుల విలువ 850 కోట్ల రూపాయల వరకూ ఉంటుందని లెక్కలేసింది. ఫిల్మ్‌ నగర్లో ఉన్న నాగార్జున ఇంటి విలువ 42 కోట్ల రూపాయల వరకూ ఉంటుందట. ఇక నాగార్జున రూ. 3 కోట్ల విలువ చేసే మెర్సిడెజ్ ఎస్ క్లాస్ కారు మెయింటైన్ చేస్తున్నారు. కోటి 30 లక్షల విలువ చేసే బీఎండబ్ల్యూ కూడా వాడుతున్నారట. ఇదీ నాగార్జున వైభోగం.


మరింత సమాచారం తెలుసుకోండి: