మరొక రెండు నెలలో ఎన్నికలు జరగబోతున్న నేపధ్యంలో ప్రధాన పార్టీల దృష్టి అంతా రాబోతున్న ఎన్నికల ఖర్చు పైనే ఉంది. అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ తెలుగుదేశంలతో పాటు చిన్న చిన్న పార్టీలు కూడ ఎన్నికల నిధుల వేట పై దృష్టి పెట్టడంతో ‘జనసేన’ కూడ తన నిధుల సమస్య పై దృష్టి పెడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈమధ్యనే ‘జనసేన’ లో చేరిన ఒక ప్రముఖ వ్యక్తి ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గోదావరి జిల్లాలలో తనకు తన భార్యకు టిక్కెట్ ఇవ్వడమే కాకుండా తాను సూచించిన మరో ముగ్గురు వ్యక్తులకు రాబోతున్న ఎన్నికలలో ‘జనసేన’ టిక్కెట్లు ఇస్తే పార్టీకి వంద కోట్లు విరాళం ఇస్తానని పవన్ వద్ద చెప్పినట్లు తెలుస్తోంది. దీనితో ఆప్రముఖ వ్యాపారవేత్త చేసిన సూచన గురించి పవన్ చాల సీరియస్ గా ఆలోచనలు చేస్తున్నట్లు టాక్.

సాంప్రదాయ బద్ధ పార్టీలకు భిన్నంగా డబ్బు ప్రభావం లేకుండా ఎన్నికల రణ రంగంలోకి దిగాలని ప్రయత్నాలు చేసినా ఆ ప్రయత్నాలు ఏమి సక్సస్ కాకపోవడంతో పవన్ కూడ కొందరు ప్రముఖ వ్యక్తుల దగ్గర నుండి ‘జనసేన’ కు విరాళాలు సేకరించే పరిస్థితిలోకి వెళ్ళిపోతున్నట్లు సమాచారం. దీనికితోడు ఈమధ్య కాలంలో ‘జనసేన’ లోకి అనేక మంది ప్రముఖులు పారిశ్రామికవేత్తలు చేరుతున్న నేపధ్యంలో ‘జనసేన’ కూడ సాంప్రదాయ బడ్డ పార్టీగానే మారిపోతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి.
Pawan Kalyan comments on Gun at Vizag Public Meeting
దీనితో జరుగుతున్న పరిణామాలను పరిశీలిస్తున్న జనసైనికులు రాబోతున్న ఎన్నికలలో తాము కూడ వ్యాపార వేత్తలకు పారిశ్రామిక వేత్తలకు జెండాలు మోసే కార్యకర్తలుగా మిగిలిపోవలసిందేనా అంటూ మధన పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితులలో జనసైనికులలో పెరిగిపోతున్న అసంతృప్తిని ఎలా కట్టడి చేయాలో తెలియక పవన్ తల పట్టుకుంటున్నట్లు సమాచారం..     


మరింత సమాచారం తెలుసుకోండి: