రాజమౌళి చకచకా తెరకెక్కిస్తున్న RRR సినిమా గురించి రోజుకో కొత్త న్యూస్ ప్రేక్షకుల్లో ఆసక్తిరేపుతున్నాయి. ఇటీవల ఈ సినిమా కథపై చాలా వార్తలు వచ్చాయి. ఓ బాలీవుడ్ హీరోయిన్‌ ఈ సినిమాలో నటిస్తుందని వార్తలు వచ్చినా దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు.

Image result for rrr ajay devgn


ఇప్పుడు ఈ సినిమాలో బాలీవుడ్ హీరో అజయ్ దేవగణ్ కూడా నటిస్తున్నాడని తెలుస్తోంది. ఈ సినిమాలో ఇప్పటికే తారక్, ఎన్టీఆర్ మల్టీస్టారర్‌లో వస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో అజయ్ దేవగణ్‌ ఓ కీలకపాత్ర పోషిస్తున్నాడట.

Related image


పాత్ర నిడివి తక్కువే అయినా సినిమాలో చాలా కీలకమైన పాత్రగా తెలుస్తోంది. రాజమౌళిపై ఉన్న నమ్మకంతోనే అజయ్ దేవగన్ ఈ చిన్నపాత్రకు ఒప్పుకున్నాడట. అజయ్ దేవగణ్‌ గతంలోనూ రాజమౌళితో పని చేసిన అనుభవం ఉంది. ఈగ సినిమాను హిందీలో డబ్ చేసినప్పుడు అజయ్ దేవగణ్ దానికి డబ్బింగ్ చెప్పారు.

Related image


ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన ఫోటోలు నెట్లో కలకలం సృష్టిస్తున్నాయి. పిరియాడికల్ మూవీగా చెబుతున్నారు. బ్రిటిష్ కాలం నాటి వాతావరణంలో వేసిన సెట్లు.. ఆసక్తిరేపుతున్నాయి. ఇద్దరు హీరోలు, బ్రిటీష్ నాటి కాలం.. బాలీవుడ్ హీరో, హీరోయిన్లు..ఇలా అన్నీ ప్రత్యేకతలే కనిపిస్తున్నాయి రాజమౌళి కొత్త సినిమాలో .


మరింత సమాచారం తెలుసుకోండి: