‘భాగమతి’ సినిమా తరువాత సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క మీడియాకు చాల దూరంగా ఉంటోంది. తనకు బరువు రీత్యా ఏర్పడిన సమస్యలకు వైద్యం చేయించుకుని తన లుక్ తిరిగి బాగు చేసుకోవడానికి అనుష్క ఈ గ్యాప్ తీసుకుంది అన్న వార్తలు హడావిడి చేసాయి. 
Image may contain: 1 person, smiling, close-up
ఈమధ్యనే జరిగిన రాజమౌళి కొడుకు కార్తికేయ పెళ్ళి ఫంక్షన్ లో హడావిడి చేసిన అనుష్క లుక్ ను చూసిన వారికి ఆమె శరీర బరువులో పెద్దగా మార్పు కనిపించకపోవడంతో ఆమె ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆమె బరువు తగ్గడం లేదా అంటూ కామెంట్స్ కూడ చేసుకున్నట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో నిన్న ఒక అపరిచితుడుతో అనుష్క సన్నిహితంగా ఉంటున్న ఫోటోలు లీక్ కావడంతో ప్రస్తుతం అనుష్క ఇతడితో సన్నిహితంగా ఉంటోందా అంటూ గాసిప్పులు హడావిడి చేసాయి.
Image may contain: 1 person, smiling
అయితే అనుష్కతో సన్నిహితంగా ఉన్న ఆవ్యక్తి వివరాలు ఆతరువాత లీక్ అయ్యాయి. మీడియాలో వస్తున్న వార్తల ప్రకారం ఆవ్యక్తి పేరు లుకీ కౌటినోహో. ఇతడు ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన న్యూట్రీషియన్ ఎక్స్ పర్ట్ అని తెలుస్తోంది. ప్రస్తుతం ఇతడి సలహాలతో అనుష్క తన బరువును తగ్గించుకోవడానికి డైటింగ్ చేస్తున్నట్లు సమాచారం. 
Image may contain: 1 person, smiling, close-up
గత సంవత్సరం అనుష్క ఆస్ట్రేలియా వెళ్ళినప్పుడు ఇతడు ఆమెకు పరిచయం కావడంతో ఆమెకోసం ఇతడు ప్రత్యేకంగా ఇండియాకు వచ్చి అనుష్క కోసం స్పెషల్ న్యూట్రిషియన్ క్లాసులు ఇస్తున్నట్లు సమాచారం. గత కొద్దిరోజులగా అనుష్క కొరటాల శివ చిరంజీవితో తీయబోతున్న మూవీలో హీరోయిన్ గా నటించబోతోంది అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఆ మూవీ లుక్ కోసం అనుష్క ప్రస్తుతం ఈవిధంగా కష్టపడుతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: