గత కొంతకాలంగా నాగబాబు బాలకృష్ణను టార్గెట్ చేస్తూ వేసిన సెటైర్లకు అవకాసం చూసుకుని బాలయ్య బోయపాటిని ఉపయోగించుకుని మెగా ఫ్యామిలీకి షాక్ ఇస్తున్నట్లు సమాచారం. ‘వినయ విధేయ రామ’ ఫెయిల్ అవ్వడంతో తీవ్రంగా నష్టపోయిన బయ్యర్లకు సహాయంగా 15 కోట్ల రూపాయలు ఇవ్వాలి అన్న తన ఆలోచనలకు రామ్ చరణ్ బోయపాటిని కూడ కలుపుకుని అతడి వైపు నుంచి కూడ 5కోట్ల వరకు సహాయం చేయమని చరణ్ చేసిన సూచనలకు బోయపాటి పూర్తిగా తిరస్కరించిన విషయం తెలిసిందే. 
నేనున్నానంటూ బాలయ్య హామీ
దీనితో తీవ్ర అసహనానికి లోనైన మెగా ఫ్యామిలీ బోయపాటికి ఇప్పటికే అడ్వాన్స్ లు ఇచ్చిన అల్లు అరవింద్ అదేవిధంగా మరికొందరి నిర్మాతలను ప్రభావితం చేసి బోయపాటికి ఇచ్చిన అడ్వాన్స్ లను తిరిగి ఇచ్చేయవలసిందిగా వ్యూహాత్మకంగా మెగా కాంపౌండ్ ఒత్తిడి చేయించినట్లు సమాచారం. అంతేకాదు తమ సూచనలు తిరస్కరించినందులకు బోయపాటికి ఎవరూ అవకాశాలు ఇవ్వవద్దు అన్న సంకేతాలు కూడ మెగా కాంపౌండ్ నుండి కొందరు ఇండస్ట్రీ ప్రముఖులకు ఇప్పటికే వెళ్ళినట్లు టాక్.
బాలయ్య-బోయపాటి మూవీ ఎవరు నిర్మిస్తారు?
జరుగుతున్న ఈ పరిణామాలు బాలకృష్ణ దృష్టి వరకు రావడంతో బాలయ్య వెంటనే బోయపాటిని పిలిపించి తన కాంబినేషన్ లో రూపొందింపబోయే సినిమాకు మార్చిలో పూజా కార్యక్రమాలు నిర్వహించి బోయపాటికి మానసిక ధైర్యం కలిగించే వ్యూహాలను అనుసరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేకాదు ఈసినిమా పూజా కార్యక్రమాలు అయిన తరువాత మూవీ స్క్రిప్ట్ గురించి నెమ్మదిగా ఆలోచిద్దాం అని భరోసా కూడ బోయపాటికి బాలయ్య వద్ద నుండి వచ్చినట్లు తెలుస్తోంది. 
హిట్టుపడి చాలా కాలమైంది
మెగా కాంపౌండ్ ఒకసారి ఎవరైనా ఒక హీరో పైనా లేదంటే దర్శకుడు పైనా అసహనం ప్రదర్శిస్తే అవకాశాలు ఇవ్వడానికి చాలామంది భయపడతారు. అయితే ఏవిషయంలోనూ ఎవరినీ లెక్కచేయని బాలకృష్ణ బోయపాటికి ఇస్తున్న సపోర్ట్ కేవలం ఆమూవీ ప్రారంబోత్సవం వరకు మాత్రమే జరుగుతుందా అయితే ఆతరువాత రాబోతున్న ఎన్నికలు ఆపై మారిపోయే పరిస్థుతుల నేపధ్యంలో ప్రస్తుతం ఇమేజ్ కోల్పోయిన బోయపాటికి ఎంత వరకు బాలకృష్ణ తాను ఇచ్చిన మాటను నిలబెట్టుకోగలడు ఇండస్ట్రీ వర్గాలలో ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..     


మరింత సమాచారం తెలుసుకోండి: