తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు కేరాఫ్ అడ్రాస్ అయిన డైరెక్టర్ రాంగోపాల్ వర్మ తన చిత్రాలతోనే కాదు ఈ మద్య తన ట్విట్టర్ పోస్టింగ్ లతో ఎన్నో కాంట్రవర్సీలు సృష్టిస్తున్నారు.  సినీ, రాజకీయ,క్రీడా రంగానికి చెందిన ఏ ఒక్కరినీ వదలడం లేదు. సెలబ్రెటీలను పొగుడుతూ కొన్ని వ్యంగ్యంగా మరికొన్ని పోస్టులు పెడుతున్నారు.


ప్రస్తుతం రాంగోపాల్ వర్మ లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.  ఈ చిత్రానికి సంబంధించిన పోస్టర్స్ రిలీజ్ చేస్తూ రోజుకో సంచలనం సృష్టిస్తున్నారు. అంతే ఆ మద్య రెండు లిరికల్ సాంగ్స్ కూడా వదిలారు. 


అయితే ఏపి సీఎం చంద్రబాబుని విమర్శిస్తు ఈ పాటలు ఉన్నాయని పలు విమర్శల పాలయ్యారు.  తాజాగా మరో సంచలనాని నాంది పలికారు రాంగోపాల్ వర్మ.  జస్ట్ ఆస్కింగ్... ఇది నిజమేనా? అంటూ వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ, తన ట్విట్టర్ ఖాతాలో ఓ పోల్ ను ఉంచారు. చంద్రబాబునాయుడు...

1983లో కాంగ్రెస్ ను వెన్నుపోటు పొడిచారా?

1989లో ఎన్టీఆర్ ను వెన్నుపోటు పొడిచారా?

1998లో యునైటెడ్ ఫ్రెంట్ ను వెన్నుపోటు పొడిచారా?

2004లో బీజేపీని వెన్నుపోటు పొడిచారా?

2009లో టీఆర్ఎస్ ను వెన్నుపోటు పొడిచారా?

2013లో వామపక్షాలకు వెన్నుపోటు పొడిచి తిరిగి బీజేపీలో చేరారా?

2018లో బీజేపీకి వెన్నుపోటు పొడిచి కాంగ్రెస్ లో చేరారా?

అని ప్రశ్నిస్తూ, 'యస్' ఆర్ 'నో' చెప్పాలని పోల్ ను ప్రారంభించారు. ఈ పోస్ట్ ఇప్పుడు వైరల్ అవుతోంది.


మరింత సమాచారం తెలుసుకోండి: