తెలుగు ఇండస్ట్రీలో మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో కొన్ని చిత్రాలు ఎప్పటికీ మర్చిపోలేము..అలాంటి చిత్రాల్లో ఖైదీ నెం.150, గ్యాంగ్ లీడర్.  ఇంత గొప్ప చిత్రాలు మెగాస్టార్ కి అందించిన ఘనత విజయబాపినీడు కి దక్కుతుంది.  అలాంటి విజయబాపినీడు కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ ఈ రోజు ఉదయం కన్నుమూశారు.  విజయబాపినీడు మన మద్య లేరన్న విషయం తెలుసుకున్న వెంటనే మెగాస్టార్ చిరంజీవి హుటా హుటిన ఆయన ఇంటికి వెళ్లారు. ఆయన పార్థవ దేహానికి నివాళులర్పించారు. 

ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ..'పట్నం వచ్చిన పతివ్రతలు' సినిమా నుంచి 6 సినిమాల వరకూ విజయబాపినీడు గారు నాతో చేస్తూ వచ్చారు.  మీతో చిత్రాలు తీస్తే నాకు ఎంతో కంఫర్ట్ గా ఉంటుందని అంటుండేవారని..అలా ఆయన నాతో వరుస చిత్రాలు చేస్తూ, నాపై తనకున్న అభిమానాన్ని .. ప్రేమను చూపారు.

నేను హైదరాబాద్ కి షిఫ్ట్ అవ్వాలనుకున్నప్పుడు 'ఎక్కడ ఉండాలి?' అని అనుకుంటూ ఉండగా, తన గెస్టు హౌస్ లో ఉండమని చెప్పి ఏర్పాటు చేశారు. 'మగమహారాజు'  వందరోజుల ఫంక్షన్ కి ఎప్పటికీ మర్చిపోలేని విధంగా నాకు ఏనుగు బహుమతిగా ఇచ్చారు.  'గ్యాంగ్ లీడర్' 100 డేస్ ఫంక్షన్ ను నాలుగు సిటీల్లో ఒకేరోజు జరిపించిన రికార్డు మా కాంబినేషన్లో వుంది. అంత గొప్ప దర్శకలు విజయబాపినీడు ని కోల్పోవడం నాకెంతో బాధాకరంగా వుంది అని చెప్పుకొచ్చారు.



మరింత సమాచారం తెలుసుకోండి: