వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న 'మహర్షి' మూవీలో అనేక ఆసక్తికర విషయాలు ఉండటంతో ఆవిషయాలను నెమ్మదినెమ్మదిగా లీక్ చేస్తూ ఆమూవీ పై అంచనాలు పెంచడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఏప్రియల్ లో విడుదల కాబోతున్న ఈమూవీ సమ్మర్ రేస్ విజేతగా మారుతుందని మహేష్ అభిమానులు విపరీతమైన అంచనాలు పెట్టుకుంటున్నారు. 
Maharshi Teaser
ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీకి సంబంధించిన మరొక లీక్ బయటకు వచ్చింది. స్నేహంలో ఉండే ఎమోషన్ బ్యాండింగ్ తో పాటు తల్లి తండ్రులతో ఉండే ఎమోషన్ వ్యక్తిగతంగా మాత్రమే కాకుండా ఫైనల్ గా సొసైటీకి ఎంత అవసరం అన్న సున్నితమైన అంశం చుట్టూ అల్లబడ్డ ఈకథ క్లాస్ ప్రేక్షకులతో పాటు మాస్ ప్రేక్షకులకు కూడ నచ్చుతుందని అభిప్రాయ పడుతున్నారు. 
Maharshi USA Shoot Postponed
ఇలాంటి పరిస్థుతులలో ప్రస్తుతం ఫైనల్ దశ షూటింగ్ లో ఉన్న ఈమూవీలో మరొక హీరో నటిస్తున్నట్లు అధికారికంగా లీకులు వదులుతున్నారు. కన్నడ ఫిలిం ఇండస్ట్రీలో రోలింగ్ స్టార్ గా పేరుగాంచిన శ్రీమురళి ఈమూవీలో మరో కీలక పాత్ర చేస్తున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ న్యూస్ సంచలనంగా మారింది. శ్రీమురళి లేటెస్టుగా ఆన్ లొకేషన్ మహేష్ ని కలిసినప్పటి ఫోటోల్ని ప్రముఖ టాలీవుడ్ పీ ఆర్ వో బీఏ రాజు ట్వీట్ చేశాడు.  

2014 కన్నడలో రిలీజైన 'ఉగ్రం' చిత్రంలో కథానాయకుడిగా నటించిన శ్రీమురళిని కన్నడ ప్రేక్షకులు అభిమానంతో రోలింగ్ స్టార్ అని పిలుస్తారు. కన్నడంలో బాగా పాపులర్ అయిన ఈహీరోను ఇప్పుడు 'మహర్షి' లో ఒక కీలక పాత్ర చేయిస్తున్న నేపథ్యంలో ఈమూవీకి కన్నడ మార్కెట్ లో కూడ మంచి క్రేజ్ ఏర్పడుతుందని అంచనాలు వేస్తున్నారు. ఇప్పటికే ఈమూవీ కథ కొంత వరకు 'శ్రీమంతుడ కు సీక్వెల్ గా ఉంటుంది అని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ రోలింగ్ స్టార్ 'మహర్షి' మూవీ ఎంట్రీ సంచలనంగా మారింది..  



మరింత సమాచారం తెలుసుకోండి: