తెలుగు ఇండస్ట్రీలో ఓటమి ఎరుగని దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సీరీస్ తర్వాత మరో ప్రతిష్టాత్మక చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.  రాంచరణ్, ఎన్టీఆర్ మల్టీస్టారర్ కాంబినేషన్ లో ‘ఆర్ఆర్ఆర్’(వర్కింగ్ టైటిల్) చిత్రాన్ని తీస్తున్న విషయం తెలిసిందే.  ఈ  చిత్రానికి సంబంధించిన ఓ షెడ్యూల్ హైదరబాద్ లో కంప్లీట్ కూడా చేశారు. రెండో షెడ్యూల్ కూడా మొదలు పెట్టారు.  ఈ చిత్రం పిరియాడికల్ కావడంతో భారీ బడ్జెట్ తో రూపొందిస్తున్నట్లు ఫిలిమ్ వర్గాల టాక్.  అయితే ఈ చిత్రానికి రామ రావణ రాజ్యం అనే టైటిల్ ని పరిశీలనలో ఉంచారట. 

Image result for jr ntr with family dubai

తాజాగా రాజమౌళి తెరకెక్కిస్తున్న భారీ మల్టీస్టారర్‌కు కొద్ది రోజులు బ్రేక్ పడిందట.  రామోజీ ఫిలిం సిటీలో ప్రత్యేకంగా వేసిన సెట్‌లో ఈ చిత్రం చిత్రీకరణ జరుపుకుంటోంది. చెర్రీ ‘ఆర్ఆర్ఆర్’లో రామరాజు అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తోంది. 

Image result for jr ntr with family dubai

కాగా, ఈ చిత్రం షూటింగ్‌కు సంబంధించి పూర్తిగా విరామమిచ్చారో లేదంటే ఎన్టీఆర్‌కు సంబంధించిన ఈ షెడ్యూల్ షూటింగ్ పూర్తయిందో కానీ యంగ్ టైగర్ మాత్రం ఫ్యామిలీతో కలిసి దుబాయ్ చెక్కేశాడు.


పనిలో పనిగా ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తూనే.. మరోవైపు ‘ఆర్ఆర్ఆర్’లో తన పాత్రకు కావల్సిన కాస్ట్యూమ్స్ కొనుక్కోవడంతో పాటు బాడీ మేకోవర్‌ని మెరుగుపరుచుకునేందుకు స్పెషల్ ట్రైనింగ్ కూడా తీసుకుంటాడట.


మరింత సమాచారం తెలుసుకోండి: