రెండు గంటల క్రితం విడుదలైన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ అనుకున్న విధంగానే భావోద్వేగాల మధ్య అందరికీ బాగా కనెక్ట్ అవుతున్న నేపధ్యంలో ఈ ట్రైలర్ నందమూరి కుటుంబ సభ్యుల దృష్టి వరకు వెళ్ళినట్లు సమాచారం. ఈ ట్రైలర్ లో ఎన్టీఆర్ కూతురు లక్ష్మీ పార్వతిని చెందెబ్బ కొట్టినట్లు చూపించడంతో పాటు చంద్రబాబు వాయస్ తో ‘దానికి కానీ కొడుకు పుట్టాడంటే మీ ఫ్యామిలీ ఫినిష్’ అంటూ వర్మ పెట్టిన డైలాగ్ కేవలం నందమూరి కుటుంబ సభ్యులకు మాత్రమే కాకుండా చంద్రబాబు పరపతిని దిగజార్చే విధంగా ఉంది. 
ఫోన్‌లో మాట్లాడింది నేనే స్వామి
దీనితో కేవలం ట్రైలర్ తోనే ఇంత ప్రళయం సృష్టిస్తున్న రామ్ గోపాల్ వర్మ ఈమూవీలో ఏమి చూపించబోతున్నాడు అన్న సందేహాలు తెలుగుదేశం వర్గాలలో కూడ విపరీతంగా పెరిగిపోతోంది. దీనితో ఈ ట్రైలర్ ను సాకుగా తీసుకుని ఈమూవీకి న్యాయపరమైన చిక్కులు సృష్టించగల అవకాసం ఉందా అన్న కోణంలో నందమూరి కుటుంబ సభ్యులు ముఖ్యంగా బాలకృష్ణ న్యాయ నిపుణులతో చర్చలు జరుపుతున్నట్లు టాక్. 
 పుకార్లు ప్రారంభం
అయితే ఈమూవీ లక్ష్మీ పార్వతి జీవితానికి  సంబంధించిన సంఘటనల చుట్టూ తీయబడిన నేపధ్యంలో ఈమూవీకి లక్ష్మి పార్వతి అనుమతులు ఇప్పటికే లభించాయి. అయితే లక్ష్మి పార్వతి అభ్యంతరాలు చెప్పకుండా ఈమూవీ విషయమై నందమూరి కుటుంబ సభ్యులు కోర్టు మెట్లు ఎక్కితే న్యాయస్థానాలు ఎలా స్పందిస్థాయి అన్న విషయమై భిన్నాభిప్రాయాలు వ్యకతవుతున్నాయి. 
చంద్రబాబు వాయిస్
ఇలాంటి పరిస్థుతులలో విడుదలైన కొన్ని గంటలలోనే సంచలనాలు సృష్టిస్తున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ తన సంచలనాలు కొనసాగిస్తున్న తీరు చూస్తుంటే ఈమూవీ మార్కెట్ కు విపరీతమైన డిమాండ్ ఏర్పడే ఆస్కారం ఉంది. ఈ నెలాఖరున ఎన్నికల షెడ్యూల్ విడుదల అవుతున్న నేపధ్యంలో అనేక వివాదాస్పద విషయాలు ఉన్న ఈసినిమా విడుదలను తాత్కాలికంగా వాయిదా వేయించడంలో ఎంత వరకు నందమూరి కుటుంబ సభ్యులు తెలుగుదేశం అధినాయకత్వం సక్సస్ అవుతుందో అన్న ఆసక్తి అందరిలోనూ పెరిగిపోతోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: