‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ట్రైలర్ కు లభించిన అనూహ్య స్పందన హాట్ టాపిక్ గా మారితే ఈ ట్రైలర్ పై వ్యూత్మక మౌనం కొనసాగిస్తున్న నందమూరి కుటుబ సభ్యుల స్ట్రాటజీ ఎవరికి అర్ధంకాని విషయంగా మారింది. ఈమూవీ ట్రైలర్ కు లక్షల సంఖ్యలో వచ్చిన అనూహ్య స్పందనకు ఆనందాన్ని వ్యక్త పరుస్తూ ఒక ప్రముఖ మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్టీఆర్ జీవించి ఉన్న రోజులలో ఆయన తన కుటుంబ సభ్యులతో అనేకసార్లు జరిపిన చర్చలలోని విషయాలను బయటపెట్టింది. 
  రెండుసార్లు వివరించారు
ఎన్టీఆర్ సతీమణి బసవతారకం మరణించిన తర్వాత దాదాపు 12 ఏళ్ల పాటు ఎలాంటి తోడు లేకుండా ఉన్న విషయాలను వివరిస్తూ ఎన్టీఆర్  నిస్సహాయ స్థితిలో ఉన్న సమయంలో ఆరోగ్యం సరిగా లేని సమయంలో తోడుకోరుకుని ఈ విషయం అర్థం చేసుకుంటారని ఎన్టీఆర్ తన కుటుంబ సభ్యులతో రెండుసార్లు మీటింగ్ పెట్టి బాద్యతగా  తనకు ఆరోగ్యం బాగాలేదు కేవలం భార్య అయితేనే తనకు సేవ చేయగలుగుతుంది అన్న విషయాన్ని సవివరంగా ఎన్టీఆర్ వివరించినా ఆ విషయాలను ఎప్పుడూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు పట్టించుకోలేదు అంటూ షాకింగ్ కామెంట్స్ చేసింది లక్ష్మి పార్వతి.
నష్టపరిహారం సెటిల్ చేశాడు
 ఇదే సందర్భంలో ఆమె ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల గురించి మాట్లాడుతూ వారు అప్పట్లో చంద్రబాబుకు సపోర్ట్ చేయకుంటే ఇంత అన్యాయం జరిగేది కాదు అని అంటూ కామెంట్స్ చేసింది లక్ష్మి పార్వతి. ఒక విధంగా ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు తన పై అనవసరంగా ఈర్ష్య ద్వేషాలను పెంచుకుని అమాయకత్వంతో తనకు అన్యాయం చేసారని అయితే అమాయకత్వంతో చేసినా అది తప్పు మాత్రమే అవుతుందని అంటూ ఆమె అభిప్రాయ పడుతోంది. ఇక మోహన్ బాబు గురించి మాట్లాడుతూ ఎన్టీఆర్ వెన్నుపోటు సంఘటన జరిగే ఆఖరి నిముషంలో మోహన్ బాబు చంద్రబాబుతో చేయి కలిపాడని అయితే ఆ తర్వాత మోహన్ బాబు తన తప్పు తెలుసుకుని అన్నగారికి అన్యాయం చేశానని క్షమాపణ చెప్పడంతో తప్పు తెలుసుకున్న వ్యక్తి గురించి కామెంట్ చేయడం సరికాదని లక్ష్మీపార్వతి అభిప్రాయపడుతోంది.
రాజకీయాల్లో వెన్నుపోట్లు లేవు
ఇది ఇలా ఉంటే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీకి చెక్ పెట్టడానికి ఎన్టీఆర్ సన్నిహితులు లక్ష్మి పార్వతి జీవితం పై మరో కోణంలో తీసిన కేతిరెడ్డి జగదీశ్వర రెడ్డి తీసిన ‘లక్ష్మీ వీరగ్రంథం’ మూవీని కూడ వచ్చే నెలలో ఎన్నికల లోపే విడుదల చేయడానికి జరుగుతున్న గట్టి ప్రయత్నాలకు సహకరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.  నిన్న జరిగిన ఒక మీడియా సమావేశంలో కేతిరెడ్డి మాట్లాడుతూ మహానుభావుడు ఎన్టీఆర్ జీవితంలోకి లక్ష్మీ పార్వతి ఎలా ప్రవేశించింది? ఆయనను పెళ్లి చేసుకునేలా ఎలా ప్రేరేపించింది. పెళ్లికి దారి తీసిన విషయాలు చాలా క్లారిటీగా తీసానని ఈమూవీ దర్శకుడు వివరిస్తున్నాడు. అంతేకాదు లక్ష్మి పార్వతి ఒరిజనల్ క్యారెక్టర్ ను వాస్తవంగా చూపెత్తడమే కాకుండా ఆమె జీవితంలోని జనానికి తెలియని రెండవ కోణం కూడ చూపెట్టబోతున్నాను అని చెప్పడంతో రాబోతున్న మార్చి నెల అంతా లక్ష్మీ పార్వతి జీవితానికి సంబంధించిన సంచలన వార్తలతోనే మీడియా హోరెత్తే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: