ప్రస్తుతం నిర్మాణంలో ఉన్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో రామ్ చరణ్ మూడు షేడ్స్ ఉండే పాత్రలో నటిస్తున్నాడు అన్న వార్తలు వినిపిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈమూవీలో జూనియర్ చరణ్ లకు సమాన ప్రాతినిధ్యం రాజమౌళి కల్పిస్తున్నా ఈమూవీలో చరణ్ పాత్ర ఒక ఛాలెంజింగ్ పాత్రగా డిజైన్ చేశారని టాక్.

ప్రస్తుతం లీక్ అవుతున్న వార్తల ప్రకారం చరణ్ ఇప్పటి వరకు ఇలాంటి షేడ్స్ ఉన్న పాత్రలో ఏసినిమాలోను నటించాలేదని వార్తలు వస్తున్నాయి. ఈ సినిమాలో చరణ్ పాత్రకు మూడు విభిన్న పార్శ్వాలు ఉంటాయట.  బ్రిటిష్ ఆఫీసర్ గా ఒక ఫ్రీడమ్ ఫైటర్ గా ఒక మాస్ నాయకుడుగా ఇలా మూడు డిఫరెంట్ షేడ్స్ ఉండే పాత్రను చరణ్ పోషిస్తున్నట్లు తెలుస్తోంది. 

అంతేకాదు చరణ్ పాత్రకు పాజిటివ్ షేడ్స్ తో పాటుగా నెగెటివ్ షేడ్స్ కూడా ఉంటాయని అంటున్నారు. 'రంగస్థలం' లోని పాత్రకు మించి చరణ్ నటనకు ఈమూవీ విడుదల తరువాత విపరీతమైన పేరు వస్తుందని అంటున్నారు. 

ఇప్పుడు ఈవార్తలు మీడియాలో వైరల్ గా మారడంతో ఈమూవీ రిలీజ్ తరువాత చరణ్ తనను నటన పరంగా డామినేట్ చేయకుండా ఇప్పటి నుంచే ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీలో జూనియర్ ఒక వైవిధ్యమైన బాడీ లాంగ్వేజ్ ని తన పాత్రకు తనకు తానుగా క్రియేట్ చేసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఇప్పటి వరకు రాజమౌళి ఎన్నో సినిమాలు తీసినప్పటికీ మల్టీ స్టారర్ మూవీలు తీయని నేపధ్యంలో చరణ్ జూనియర్ ల అభిమానులకు ఏమాత్రం అసహనం కలిగించకుండా వారు నటించే ప్రతిసీన్ లోను రాజమౌళి అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు సమాచారం..    


మరింత సమాచారం తెలుసుకోండి: