జమ్ము కశ్మీర్లోని పుల్వామాలో భారత సైనికులపై జరిగిన ఉగ్రదాడి యావత్ భారతదేశాన్ని కలిచి వేసింది. భారతీయులు ఆవేశంతో రగిలిపోతూ ప్రతీకారం తీర్చుకోమని కోరుతున్నారు. ఈ పరిస్థుతులలో ప్రతీకారం విషయం పక్కకు పెట్టి ఈ ఉగ్రదాడిలో చనిపోయిన సైనికుల కుటుంబాలను ఆర్ధికంగా ఆదుకోవడం కోసం మన కేంద్ర ప్రభుత్వం 'భారత్ కే వీర్' అనే వెబ్సైట్ను ప్రభుత్వం ప్రారంభించింది. 

ఈ వెబ్సైట్ ద్వారా సైనిక నిధికి నేరుగా విరాళాలు అందించవచ్చు. ప్రస్తుతం దేశం యావత్తు వారివారి స్థాయిలలో ఈ వెబ్ సైట్ ద్వారా విరాళాలు ఇస్తున్నారు. సినిమా సెలెబ్రెటీలు పారిశ్రామిక వేత్తలే కాకుండా సామాన్యుల నుంచి కూడ వస్తున్న అనూహ్య స్పందన బట్టి ఈ సంఘటన ఎంతగా కదిలించి వేసిందో అర్ధం అవుతుంది. 

ఈ సహాయ నిధికి టాప్ టాలీవుడ్ సెలెబ్రెటీలు ఇంకా పూర్తిగా స్పందించకుండానే విజయ్ దేవరకొండ అందరికంటే ముందుగా రంగంలోకి దిగి ఈ నిధికి 15 లక్షలు విరాళం ఇవ్వడమే కాకుండా తన అభిమానులను కూడ వారి శక్తి మేరకు ఈ నిధికి విరాళాలు పంపించమని విజయ్ దేవరకొండ పిలుపు ఇవ్వడం హాట్ టాపిక్ గా మారింది.  ఈ సహాయ నిధికి వచ్చే మొత్తాన్ని ఈ ప్రమాదంలో చనిపోయిన నేరుగా సైనికుల కుటుంబానికి చేరే విధంగా 'భారత్ కే వీర్ అనే కార్పస్ ఫండ్'  అకౌంట్కు భారత ప్రభుత్వం నియమించే కమిటి బాధ్యత వహిస్తుంది. 

ఇందులో ప్రముఖులు, స్వచ్చంద సేవకులు, సామాజిక కార్యకర్తలు సభ్యులుగా ఉంటారు. సైనిక కుటుంబాల ఆర్థిక అవసరాలను గుర్తించి వారికి అండగా ఈకమిటీ నిలుస్తుంది. ఇలాంటి ఉదాత్త కార్యక్రమానికి అందరికంటే ముందుగా నేనున్నాను అంటూ విజయ్ దేవరకొండ స్పందించడం అతడి మంచి మనసుకు నిదర్శనం అంటూ అతడి అభిమానులు విజయ్ పై ప్రశంసలు కురిపిస్తున్నారు. విజయ్ బాటలోనే పయనిస్తూ కోలీవుడ్ టాప్ హీరో సూర్యా కూడ ఈనిధికి 15 లక్షల విరాళం పంపినట్లు వార్తలు వస్తున్నాయి. దీనితో విజయ్అ ని నుసరిస్తూ మన టాలీవుడ్ టాప్ హీరోలు ఈ విషయమై ఎలా స్పందిస్తారో చూడాలి..



మరింత సమాచారం తెలుసుకోండి: