బాలయ్యకు ఎన్టీఆర్ కథానాయకుడు చేదు అనుభవం మిగిల్చిన నేపథ్యంలో మహానాయకుడు విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ఫస్ట్ మూవీ మరీ డాక్యుమెంటరీగా సాగిందని.. చాలా సాగతీత ఉందని కామెంట్స్ వచ్చాయి. అందుకే సెకండ్ మూవీలో అలాంటి ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు.

సంబంధిత చిత్రం


అందుకే రన్ టైం ఫస్ట్ హాఫ్ తో పోలిస్తే సుమారుగా అరగంటకు పైగా తగ్గిపోయింది. కథానాయకుడు 2 గంటల 45 నిమిషాల దాకా ఉండగా మహానాయకుడు కేవలం 2 గంటల 8 నిముషాలు మాత్రమే వచ్చింది. పాటలు మాస్ మసాలాలు ఏమి లేకుండా కేవలం ఎన్టీఆర్ రాజకీయ జీవితాన్ని మాత్రమే నేపధ్యంగా తీసుకున్నారు.

ntr mahanayakudu RANA కోసం చిత్ర ఫలితం


కథానాయకుడులో అనవసరమైన ప్రహసనాలకు చోటివ్వడం వల్లే ప్రేక్షకులు అసహనంగా ఫీలయ్యారని రిపోర్ట్స్ వచ్చాయి. అయితే ఈసారి రానా బాగా హై లైట్ అవుతుండటం ఇప్పటికే చర్చలో ఉంది. తెలుగుదేశం పార్టీ స్థాపన మొదలుకుని రెండు సార్లు ఎన్టీఆర్ అధికార పీఠం మీద కూర్చోవడం దాకా కవర్ చేసినట్టు తెలుస్తోంది.

సంబంధిత చిత్రం


అయితే ఈ ఎపిసోడ్స్ మూలంగా ఎన్టీఆర్ గా నటించిన బాలయ్య కంటే.. చంద్రబాబుగా నటించిన రానాయే కీలక పాత్ర ధారిగా మారుతున్నాడు. లక్ష్మీపార్వతి ఎపిసోడ్ ఉండే ఛాన్స్ లేకపోవడం వల్ల రానా ఇంచుమించు హీరోకు పోటీగా నిలుస్తున్నాడు. అందుకే ఇప్పుడు మహా నాయకుడు హీరో బాలకృష్ణా.. రానానా అన్న చర్చ మొదలైంది.


మరింత సమాచారం తెలుసుకోండి: