‘ఎఫ్ 2’ సక్సస్ తరువాత అనూహ్యంగా మహేష్ అనిల్ రావిపూడిల ప్రాజెక్ట్ వేగం అందుకోవడంతో ఈ మూవీకి సంబంధించిన వార్తలు సంచలనం సృష్టిస్తున్నాయి. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ మూవీ ప్రాజెక్ట్ కు అనీల్ రావిపూడి ‘వాట్స్ అప్’ అన్న టైటిల్ ఫిక్స్ చేసి ఫిలిం చాంబర్ లో రిజిస్టర్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. 

అనిల్ రావిపూడి చీటింగ్ ను బయటపెట్టిన పరుచూరి గోపా కృష్ణ !
అనిల్ రావిపూడి టైటిల్స్ అన్నీ ఇంగ్లీష్ పదాల నేపధ్యంలో ఉంటాయి. ‘రాజాది గ్రేట్’ నుండి ‘ఎఫ్ 2’ వరకు అనీల్ రావిపూడి తీసిన సినిమాలకు ఇంగ్లీష్ పదాల సెంటిమెంట్ బాగా కనిపిస్తుంది. దీనితో ఇదే సెంటిమెంట్ ను మహేష్ సినిమాకు కూడ ఈ క్రేజీ డైరెక్టర్ కొనసాగించబోతున్నట్లు తెలుస్తోంది. 
Mahesh Babu
తెలుస్తున్న సమాచారం మేరకు అవుత అండ్ అవుత కామెడీగా ఈమూవీ స్క్రిప్ట్ తయారు అయింది అంటున్నారు. ‘మహర్షి’ విడుదలైన వెంటనే పెద్దగా గ్యాప్ ఇవ్వకుండా ఈమూవీని మొదలుపెట్టి వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల అయ్యేలా ఈ ‘వాట్స్ అప్’ ప్రాజెక్ట్ ను డిజైన్ చేస్తున్నట్లు సమాచారం. 

అనిల్ రావిపూడి చీటింగ్ ను బయటపెట్టిన పరుచూరి గోపా కృష్ణ !
ఈవార్తలే నిజం అయితే అనిల్ రావిపూడి ఈ సంక్రాంతికి వచ్చిన ‘ఎఫ్ 2’ సక్సస్ ను వచ్చే ఏడాది వచ్చే సంక్రాంతికి ‘వాట్స్ అప్’ ద్వారా కొనసాగించే ఆస్కారం కనిపిస్తోంది. ‘ఎఫ్ 2’ లో భార్యాభర్తల మధ్య జరిగే ఆదిపత్య పోరును సున్నితంగా హాస్యంతో చూపించిన అనిల్ రావిపూడి ఈ ‘వాట్స్ అప్’ మూవీ ద్వారా ప్రజల జీవితాలను ప్రభావితం చేస్తున్న స్మార్ట్ ఫోన్స్ సోషల్ మీదియాను తన సునిశితమైన సెటైర్లతో టార్గెట్ చేసే ఆస్కారం ఉంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: