ఆమధ్య రాజమౌళి కొన్ని చిన్న సినిమాలకు బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరిస్తూ కొన్ని చిన్న సినిమాలకు ప్రశంసలు కురిపించడంతో ఆసినిమాల పై ప్రేక్షకులకు అంచనాలు పెరిగాయి. అయితే ఆ చిన్న సినిమాలు విడుదల అయ్యాక ఘోరమైన ఫ్లాప్ లుగా మారడంతో అలాంటి చెత్త సినిమాలు ప్రమోట్ చేయవద్దని రాజమౌళికి అతడి అభిమానులు కూడ విజ్ఞప్తులు చేసారు.

ఇప్పుడు ఇలాంటి పరిస్థితి అల్లు అర్జున్ కు కూడ ఎదురవ్వడం హాట్ టాపిక్ గా మారింది. దీనికి కారణం ఈమధ్య అల్లు అర్జున్ ప్రమోట్ చేసిన ‘పడి పడి లేచె మనసు’ అదేవిధంగా గతవారం వాలెంటైన్స్ డే కు విడుదలైన ‘లవర్స్ డే’ మూవీలు ఘోరమైన ఫ్లాప్ లుగా మారడం అని అంటున్నారు.

మరీ ముఖ్యంగా అల్లు అర్జున్ ‘లవర్స్ డే’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు రావడమే కాకుండా ఆ మూవీలో నటించిన ప్రియా వారియర్ ను ఆకాశానికి ఎత్తేస్తూ ప్రశంసలు కురిపించడంతో బన్నీ అంచనాలను నమ్ముకుని ఆమూవీకి వెళ్ళిన అల్లు అర్జున్ అభిమానులు షాక్ అవ్వడమే కాకుండా ఆమూవీ ఒక సి క్లాస్ మూవీ చూసిన ఫీలింగ్ కలిగింది అంటూ కామెంట్స్ చేస్తున్నారు. అంతేకాదు ఇలాంటి చెత్త సినిమాలను ప్రమోట్ చేసి అల్లు అర్జున్ తన పరపతిని పోగొట్టుకోవద్దు అంటూ కామెంట్స్ కూడ పెడుతున్నారు. 

ఇది ఇలా ఉండగా టాలీవుడ్ నిర్మాతలు ప్రియ వారియర్ కు కృతజ్ఞతలు తెలియ చేస్తూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్. దీనికి కారణం ప్రియ వారియర్ క్రేజ్ ను చూసి ఆమెకు అత్యంత భారీ పారితోషికాలను ఆఫర్ చేస్తూ ఆమెకు తమ సినిమాలకు సంబంధించి అడ్వాన్స్ లు ఇచ్చినా ప్రియ వాటిని తీసుకోకుండా ‘లవర్స్ డే’ విడుదల అయ్యాక కలవండి అంటూ ఆమె తమకు ఊహించని ఉపకారం చేసింది అంటూ కామెంట్స్ చేస్తున్నట్లు టాక్..    


మరింత సమాచారం తెలుసుకోండి: