రాజకీయాలు సినిమా రంగం ఒకటి అధికారం రెండవది గ్లామర్ ఐదు పదుల వయసు దాటినా ఇప్పటికీ బాలీవుడ్‌ లో మోస్ట్ ఎలిజబుల్ బ్యాచిలర్‌ గా కండల వీరుడు సల్మాన్‌ఖాన్‌ కొనసాగు తున్నారు. అలాగే రాజకీయాల్లో రాహుల్‌ గాంధీ.


అయితే సినిమా ల్లో సల్మాన్‌ ఖాన్ పెళ్లి విషయంలో జరిగినంత చర్చ ఎవరిపైనా జరగలేదు. ఎప్పటికైనా తమ అభిమాన హీరో పెళ్లి చేసుకోక పోతాడా అని అటు సల్మాన్ అభిమానులు ఎదురు చూస్తూనే ఉన్నారు. అయితే తాజాగా ఒక అభిమాని నేరుగా అతని పెళ్లి గురించి అడిగేశాడు. 
A fan asked Katrina Kaif to marry Salman Khan

అయితే అతడు అడిగింది సల్మాన్‌ ను కాదు. హీరోయిన్ కత్రినా కైఫ్‌ ని. కత్రినా చేసిన ఒక ఇన్‌స్టాగ్రామ్ పోస్ట్‌పై ఒక అభిమాని కామెంట్ చేస్తూ, "మా సల్మాన్‌ను పెళ్లి చేసుకోవా కత్రినా! ప్లీజ్" అని అడిగాడు. ఇదే విషయాన్ని ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో కత్రినా ను అడిగితే.. హుష్ష్ష్స్....అంటూ ఒక ఎక్స్‌ప్రెషన్ ఇచ్చింది. అంతేకాదు తన పెళ్లి పై ఇంకాస్త ఓపెన్ అయింది. 


నాకు నిజంగా తెలియదు. పెళ్లి అంటే ఇద్దరికి సంబంధించిన విషయం. ఇద్దరి మనసులు కలవాలి. అలాంటి వ్యక్తి కలిస్తే అప్పుడు చేసుకుంటా! అని కత్రినా చెప్పడం విశేషం. కత్రినా, సల్మాన్ ఐదేళ్ల పాటు డేటింగ్‌ లో ఉన్న విషయం తెలిసిందే. 2009 లో వీళ్లు విడిపోయారు. అయితే ఆ తర్వాత కూడా ఇద్దరి మధ్య మంచిస్నేహమే కొనసాగుతున్నది. ఒకరినొకరు ఫ్యామిలీగా చెప్పు కుంటారు.
A fan asked Katrina Kaif to marry Salman Khan
గతంలో టైగర్ జిందా హై లో ఈ ఇద్దరు కలిసి నటించారు. మరోసారి భారత్ మూవీ కోసం జత కట్టారు. అయినా దీనికి ఆమె చెప్పిన సమాధానం అందరినీ కన్ఫ్యూజన్ లో పడేసింది. సల్మాన్ ఖాన్, కత్రినాల మధ్య మంచి బంధం ఉన్న సంగతి తెలిసిందే. 

మరింత సమాచారం తెలుసుకోండి: