హార్వర్డ్ యూనివర్సిటీ ఆహ్వానం మేరకు ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు బ్రేక్ ఇచ్చి రాజమౌళి హార్వర్డ్ లోని కెనడీ స్కూల్ విద్యార్ధులకు సందేశం ఇవ్వడానికి వెళ్ళిన విషయం తెలిసిందే. ‘ప్రజలకు వినోదం అందించడంలో సినిమా పాత్ర’ అనే విషయం పై విద్యార్ధులతో తన అనుభవాలను పంచుకోవడానికి రాజమౌళి హార్వర్డ్ వెళ్ళాడు.
Rajamouli-Gives-Chance-to-Hidden-Force-Behind-Latest-Hits
సాధారణంగా సినిమా రంగానికి సంబంధించి ప్రపంచఖ్యాతి పొందిన ప్రముఖుల చేత ఇలాంటి అంశాల పై హార్వర్డ్ యూనివర్సిటీలో ప్రసంగాలు ఏర్పాటు చేస్తారు. ‘బాహుబలి’ తో రాజమౌళికి ఏర్పడిన అంతర్జాతీయ ఖ్యాతితో ఈ అరుదైన అవకాసం రాజమౌళికి వచ్చింది. సాధారణంగా ఏవిషయం పై అయినా చాల వివరణాత్మకంగా మాట్లాడే రాజమౌళి హార్వర్డ్ యూనివర్సిటీలో మాట్లాడుతున్నప్పుడు అతడి ఉపన్యాసాన్ని విద్యార్దులు చాల శ్రద్ధగా విన్నట్లు సమాచారం.
S.S. Rajamouli
ఇదే సందర్భంలో రాజమౌళి తాను తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ మూవీ విషయాలను కూడ అక్కడి విద్యార్ధులతో షేర్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ‘ఆర్ ఆర్ ఆర్’ కథ కేవలం భారతదేశంలోని ఒక ప్రాంతానికి సంబంధించింది కాదని భారతదేశ స్వాతంత్ర ఉద్యమ నేపద్యంలో భారతదేశంలోని అన్ని ప్రాంతాలకు అదేవిధంగా అన్ని భాషలకు కనెక్ట్ అయ్యే విధంగా ‘ఆర్ ఆర్ ఆర్’ కథ ఉంటుంది అని లీకులు ఇచ్చినట్లు టాక్. 

అంతేకాదు ‘ఆర్ ఆర్ ఆర్’ కథ ‘బాహుబలి’ స్థాయికి ఏమాత్రం తీసిపోదని భావోద్వేగాల మధ్య నడిచే ఈకథ ప్రతి భారతీయుడుకి కనెక్ట్ అవుతుంది అంటూ రాజమౌళి ‘ఆర్ ఆర్ ఆర్’ పై స్పందించాడు. ఈసినిమా మొదలై చాల రోజులు అయినప్పటికీ ఈమూవీ కథ గురించి ఎక్కడా ఒక్క లీకు ఇవ్వని రాజమౌళి హార్వార్డ్ యూనివర్సిటీలో ‘ఆర్ ఆర్ ఆర్’ గురించి మాట్లాడటం బట్టి ‘ఆర్ ఆర్ ఆర్’ ప్రాజెక్ట్ కు ఇండియాలోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఈమూవీ ప్రాజెక్ట్ కు క్రేజ్ తీసుకు రావాలి అన్న వ్యూహాలతో సరైన వేదికగా హార్వర్డ్ యూనివర్సిటీని ఎంచుకున్నట్లు అనిపిస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: