బుల్లితెర పాపులర్ కామెడీ షో 'జబర్దస్త్'  పేరు వినగానే ఎవరికైనా ముందుగా గుర్తుకు వచ్చేది కమెడియన్ హైపర్ ఆది పేరు మాత్రమే. అతడు ‘జబర్దస్త్‌’ లోకి ఎంటరైన తర్వాత మిగతా టీమ్స్ చాలా వెనకపడిపోయాయి అనే కామెంట్స్ ఉన్నాయి. అయితే అనుకోకుండా అతడికి వచ్చిన క్రేజ్ అతడిలో విపరీతమైన ఆత్మ విశ్వాసాన్ని పెంచి తరుచు వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం ఇతడి అలవాటుగా మారింది.
ఆయనతో పోల్చడానికి కారణం అదే...
ఇలాంటి పరిస్థుతులలో ఇతడు ఈమధ్య ఒక మీడియా సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనను కొందరు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్థాయితో పోలుస్తున్నారు అంటూ చెప్పి ఆ ఇంటర్వ్యూ చూస్తున్న వ్యక్తుల మైండ్ బ్లాంక్ చేసాడు. త్రివిక్రమ్ మాట్లలలో పంచ్ లు ఉన్నట్లే తాను వ్రాసే మాటలలో పంచ్ లు ఉంటాయని అందువల్లనే కొందరు అభిమానులు తనను బుల్లితెర త్రివిక్రమ్ శ్రీనివాస్ అంటూ ప్రశంసలు కురిపిస్తూ ఉంటారు అన్న విషయాలను బయటపెట్టాడు. 
అలా టీమ్ లీడర్ స్థాయి వరకు
ఇదే సందర్భంలో త్రివిక్రమ్ రైటింగ్ టీమ్ లో తనను చేరమని త్రివిక్రమ్ కోరినట్లుగా వచ్చిన వార్తలలో ఏమాత్రం నిజం లేదని గతంలో రెండు మూడు సార్లు తాను త్రివిక్రమ్ ను కలిసినా తమ మధ్య అటువంటి చర్చలు జరగలేదని అంటూ క్లారిటీ ఇచ్చాడు హైపర్ ఆది. తాను బీటెక్ చదివినప్పటికీ సినిమాలపట్ల మోజుతో తాను సినిమా రంగంలోకి ప్రవేసించడానికి ప్రయత్నించి అక్కడ అవకాశాలు రాకపోవడంతో బుల్లితెర ‘జబర్దస్త్’ షో వైపు అడుగులు వేసిన సందర్భాన్ని వివరించాడు. 
సాఫ్ట్‌వేర్ జాబ్ చేసే నేను అనుకోకుండా ఇలా...
గతంలో బుల్లితెరలోకి రాక ముందు ఫేస్‌బుక్‌లో ఫోటో పెడితే 2 లైకులు వచ్చిన విషయాలను గుర్తుకు చేసుకుంటూ అప్పట్లో  ‘జబర్దస్త్’ టీమ్ తో దిగిన ఫోటోలు పెడితే 200 లైక్స్ వచ్చిన సందర్భంలో బుల్లితెర ‘జబర్దస్త్’ షోకు అంత ప్రాముఖ్యత ఉంది అన్న విషయాలను గుర్తించి తాను ‘జబర్దస్త్’ టీమ్ లోకి రైటర్ గా అడుగుపెట్టి ఆతరువాత చిన్నచిన్న పాత్రలు చేస్తూ తాను టీమ్ లీడర్ గా ఎదిగిన సందర్భాలను సవివరంగా వివరించాడు హైపర్ ఆది. అయితే ఏకంగా త్రివిక్రమ్ రైటింగ్ స్కిల్స్ ను తన రేటింగ్ స్కిల్స్ తో పోల్చుకుంటూ ఆది చేసిన కామెంట్స్ మాత్రం చాలందికి మితిమీరిన అతిగా అనిపిస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: