బాలీవుడ్‌ సూపర్‌స్టార్ అక్షయ్‌ కుమార్‌ ప్రధాన పాత్రలో నటించిన చిత్రం ‘కేసరి’. 1891లో జరిగిన సారాగడి యుద్ధంలో పాల్గొన్న హవీల్దార్‌ ఇషార్‌ సింగ్‌ పాత్రలో అక్షయ్‌ నటిస్తున్నారు. అనురాగ్‌ సింగ్‌ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. ‘బ్యాటిల్‌ ఆఫ్‌ సారగడి’ సంఘటన ఆధారంగా రూపొందిన ఈ సినిమాలో అక్షయ్‌ హవీల్దార్‌ ఇషార్‌ సింగ్‌ పాత్రలో కనిపిస్తాడు. 1897లో బ్రిటీష్ ఇండియన్ బృందాలకు, ఆఫ్ఘనిస్థాన్ బృందాలకు మధ్య జరిగిన సరాగర్హి యుద్ధం నేపథ్యంలో ఈ చిత్రం తెర‌కెక్కింది.
Kesari Official Trailer released
ఈ చిత్ర ట్రైలర్‌ను గురువారం విడుదల చేశారు. ‘నేను తన బానిసనని, భారతీయులంతా మూర్ఖులని ఓ బ్రిటిష్‌ వ్యక్తి నాతో అన్నాడు. అలాంటివారికి బుద్ధి చెప్పాల్సిన సమయం వచ్చింది’ అంటూ అక్షయ్‌ చెప్పే డైలాగ్‌తో ట్రైలర్‌ మొదలైంది.  అఫ్గాన్ పఠాన్లు, భారత సైనికులకు మధ్య యుద్ధం జరిగింది. కేవలం 21 మంది బ్రిటిష్ ఇండియా సైనికులు ఏకంగా 10,000 మంది పఠాన్ల సైన్యాన్ని ధైర్యంగా ఎదుర్కొన్నారు.
Image result for kesari movie stills
దాదాపు 600 మంది శత్రువులను హతమార్చాక 21 మంది అమరులవుతారు. ట్రైలర్‌లో అక్షయ్‌కుమార్ పోరాట సన్నివేశాలు హైలైట్‌గా నిలిచాయి. ‘నేను ధరించిన ఈ తలపాగా కేసరి (కాషాయం), కారుతున్న నా నెత్తురు కేసరి..’ అంటూ అక్షయ్‌ చెప్పే డైలాగ్‌ ఆకట్టుకుంటోంది.
Image result for kesari movie stills
కరణ్ జోహార్‌ ధర్మ ప్రొడక్షన్స్‌, కేప్‌ ఆఫ్‌ గుడ్‌ ఫిలింస్‌, అజుర్‌ ఎంటర్‌టైన్మెంట్స్‌, జీ స్టూడియోస్‌ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా.. అనురాగ్‌ సింగ్‌ దర్శకత్వం వహిస్తున్నాడు. పరిణితీ చోప్రా హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమా మార్చి 21న ప్రేక్షకుల ముందుకు రానుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: