ఈరోజు విడుదలైన ‘మహానాయకుడు’ ఓవర్సీస్ ప్రీమియర్ షోలతో పాటు హైదరాబాద్ లో ప్రదర్శించిన ప్రత్యేకమైన షోస్ టాక్ బయటకు వచ్చింది. కనీసం ‘మహానాయకుడు’ మూవీకి అయినా పాజిటివ్ టాక్ తీసుకు రావాలని బాలకృష్ణ ఈప్రీమియర్ షోల ద్వారా చేసిన ప్రయత్నాలకు కూడ డివైడ్ టాక్ వచ్చింది. రెండుగంటల ఎనిమిది నిముషాల నిడివితో ఉన్న ఈమూవీ ఎన్టీఆర్ చిన్ననాటి జ్ఞాపకాలకు సంబంధించి పెట్టిన పాట ఈమూవీకి హైలెట్ అని ఈమూవీని చూసిన ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 
గవర్నర్ రాజీనామా ఆదేశం సీన్‌తో ఇంటర్వెల్
ఎన్టీఆర్ రాజకీయాలలో ప్రవేశించడం ఆతరువాత ఎన్టీఆర్ ప్రసంగాలకు విపరీతమైన స్పందన వచ్చి ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా మొట్టమొదటిసారి తెలుగుదేశం ఘన విజయం సాధించడం ఆతరువాత ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పదకాలు ఒక డాక్యుమెంటరీలా చూపెట్టారు. రాజకీయ రంగంలో ఎన్టీఆర్ దూకుడును ప్రదర్శించే సమయంలో ఆయన భార్య బసవతారకంకు క్యాన్సర్ వ్యాధి రావడంతో ఈమూవీ భావోద్వేగాల టర్న్ తీసుకుని ఆతరువాత ఎన్టీఆర్ తనకు ఓపెన్ హార్ట్ సర్జరీ చేయించుకునే నిమిత్తం అమెరికా వెళ్ళినప్పుడు జరిగిన నాదెండ్ల నమ్మక ద్రోహం సీన్స్ ను యధాతధంగా తీసాడు క్రిష్. 
తిరిగి అధికారంలోకి ఎన్టీఆర్
అయితే ఇక్కడి నుండి సినిమా పూర్తిగా ట్రాక్ తప్పింది అన్న కామెంట్స్ ఈ ప్రీమియర్ షోను చూసినవారు చేస్తున్నారు. ఎన్టీఆర్ ను పక్కకు పెట్టి చంద్రబాబు పాత్రను ఎలివేట్ చేయడం అసలు చంద్రబాబు లేకపోతే ఎన్టీఆర్ రాజకీయ జీవితం లేదు అని అర్ధం వచ్చేలా సీన్స్ క్రియేట్ చేయడం ఎంతవరకు నందమూరి అభిమానులు అంగీకరిస్తారు అన్నది ప్రశ్న. దీనితో ‘మహానాయకుడు’ కూడ సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ అవ్వడం కష్టం అన్న తాక వస్తోంది. ఎన్టీఆర్ జీవితంలోని భావోద్వేగ సన్నివేశాలకే దర్శకుడు క్రిష్ ప్రాధాన్యం ఇచ్చినా ఆ సీన్స్ సామాన్య ప్రేక్షకులకు కనెక్ట్ కాకపోవచ్చు. ముఖ్యంగా ఎన్టీఆర్ మహానాయకుడిగా ఎలా మారాడానికి కారణమైన అంశాలను ఎలివేట్ చేయలేకపోయడం ఈమూవీకి ఒక మైనస్ అనీ ఓవర్సీస్ ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. 
చంద్రబాబు నాయుడుగా రానా ఎంట్రీ
ఎన్టీఆర్‌ పాత్రలో బాలకృష్ణ బసవతారకం పాత్రలో విద్యాబాలన్ ఈ బయోపిక్ రెండవ పార్ట్ లో కూడ ఒదిగి పోయి నటించినా ఈమూవీ విజయానికి వారిద్దరి నటన ఏమాత్రం సహకరించవు అన్న అభిప్రాయం సామాన్య ప్రేక్షకులకు కలుగుతుందని ఈమూవీ ప్రీమియర్ షో టాక్ తెలియచేస్తోంది.  ఇక చివరిగా ఈమూవీ ప్రీమియర్ షో చూసి బయటకు వస్తున్న ప్రేక్షకులు ఈమూవీని ఎన్టీఆర్ బయోపిక్ అనే కంటే చంద్రబాబు జీవిత చరిత్ర అని అనడం బాగుటుంది అంటూ చేస్తున్న కామెంట్స్ ను బట్టి ‘మహానాయకుడు’ మూవీ కూడ సగటు ప్రేక్షకులను మెప్పించడంలో ఫెయిల్ అయి చివరకు ఎన్టీఆర్ బయోపిక్ మూవీ ఒక ఫెయిల్యూర్ మూవీగా చరిత్రలో నిలిచిపోయే ఆస్కారం కనిపిస్తూ ఉండటం నందమూరి అభిమానులు జీర్ణించుకోలేని వాస్తవం..   


మరింత సమాచారం తెలుసుకోండి: