నిన్నరాత్రి ‘మహానాయకుడు’ మూవీ స్పెషల్  షోను చూడటానికి టాలీవుడ్ కు సంబంధించిన చాల మంది ప్రముఖులు వచ్చారు. ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ మంచి విజయం సాధిస్తుందనే ధీమా వ్యక్తం చేస్తూ అనేక మంది వ్యక్త పరిచిన అభిప్రాయాలలో దర్శకుడు పూరి జగన్నాథ్ కామెంట్ హైలెట్ గా మారింది. ఈ సినిమా చూసిన తరువాత పూరి మీడియా వర్గాలతో మాట్లాడుతూ ఎన్టీఆర్ కథానాయకుడు చిత్రం తనకు ఎంతగా నచ్చిందో అంతకంటే ఎక్కువగా ‘మహానాయకుడు’ చిత్రం తనకు నచ్చిందని ఈ మూవీ పై ప్రశంసలు కురిపించాడు.  
 డిజప్పాయింట్ అయ్యా
ముఖ్యంగా ‘మహానాయకుడు’ లో బసవతారకం గురించి ఎన్టీఆర్ చెప్పే డైలాగ్  అదేవిధంగా  ఎన్టీఆర్ కు అసెంబ్లీలో జరిగిన అన్యాయం చూసిన తనకు కంట వచ్చిన కన్నీరు ఆపుకోలేక వెక్కివెక్కి  ఏడిచిన విషయాలను వివరించాడు. దర్శకుడు నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ మాట్లాడుతూ వాస్తవంగా చెప్పాలంటే పార్ట్ 1 సినిమా చూసి తాను   డిజప్పాయింట్ అయిన విషయాన్ని వివరిస్తూ  అయితే ‘మహానాయకుడు’ అద్భుతంగా ఉందని ఎన్టీఆర్ కు జరిగిన అన్యాయాల గురించి టీవీలలో పేపర్లలో చూసిన విషయాలను ‘మహానాయకుడు’ చిత్రంలో సినిమా సన్నివేశాలుగా  చూస్తుంటే తన రోమాలు నిక్కబొడుచుకున్నా విషయాలను వివరించాడు.  
నారా బ్రాహ్మణి
అంతేకాదు ఈ మూవీ  ప్రతి ఒక్కరికి నచ్చుతుందని భావిస్తున్నట్లు భరద్వాజ అభిప్రాయ పడ్డాడు. ఈ మూవీ స్పెషల్ షోకు వచ్చిన పరుచూరి గోపాల కృష్ణ మాట్లాడుతూ ఎన్టీఆర్ ‘మహానాయకుడు’ చిత్రం చూడగానే తన గొంతు తడి ఆరిపోయింన విషయాన్ని వివరిస్తూ ఈమూవీలో బసవతారకంను చూడగానే తన కళ్ళు చెమర్చిన విషయాలను వివరిస్తూ తానూ  తారకమ్మ దగ్గర మూడుసార్లు భోజనం చేసిన విషయాలను గుర్తుకు చేసుకున్నాడు. 
మూడుసార్లు భోజనం
సిరివెన్నెల సీతారామశాస్త్రి మాట్లాడుతూ కరిగిపోయిన కాలాన్ని మళ్ళీ మన కళ్ళ ఎదుట చూపించిన బాలకృష్ణ క్రిష్ ల కృషి గురించి ఎంత చెప్పినా సరిపోదు అంటూ బావ యుక్తంగా స్పందించారు. ఇలా ఇండస్ట్రీ కి సంబంధించిన ఎందరో ప్రముఖ ప్రశంసలు ‘మహానాయకుడు’ ని కలెక్షన్స్ విషయంలో ఎంత వరకు రక్షిస్తాయో చూడాలి.. 



మరింత సమాచారం తెలుసుకోండి: