దాసరి శిష్యుడుగా ఫిలిం ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చి దాసరి నారాయణరావు కూడ టచ్ చేయని వివిధ రకాల జోనర్స్ కు సంబంధించిన సినిమాలు చేసి సుమారు 140 సినిమాలకు దర్శకత్వం వహించిన కోడి రామకృష్ణ టాలీవుడ్ ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించి ఒక ప్రయోగశాల. ‘అమ్మోరు’ లాంటి సినిమాను తీసిన రామకృష్ణ ‘తలంబ్రాలు’ లాంటి యాంటి సెంటిమెంట్ తీయగల సమర్ధత ఆయన సొంతం.
ఎప్పటికైనా పూర్తి చేయాలి
నిన్న చనిపోయిన కోడి రామకృష్ణ గురించి అనేకమంది అనేక జ్ఞాపకాలు గుర్తుకు చేసుకుంటున్నారు. ఇలాంటి సందర్భంలో చిరంజీవి కోడి రామకృష్ణ భౌతిక దేహాన్ని చూసి ఉద్వేగంగా చెలించిపోతు అప్పట్లో రామకృష్ణ తీసిన మొదటి సినిమా ‘ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణయ్య’ మూవీ షూటింగ్ లో జరిగిన ఆసక్తికర విషయాన్ని గుర్తుకు చేసుకున్నాడు. 
దాసరికి తర్వాత ఆయనే
ఈమూవీకి సంబంధించిన షూటింగ్ అంతర్వేదిలో జరిగిన తరువాత ఆసినిమా యూనిట్ లాంచ్ లో గోదావరి పై మొగల్తూరు వెళుతున్నారట. ఈ ప్రయాణం మధ్యలో లాంచీ లోపల ఉన్న చిరంజీవి లాంచీ పై భాగంలో ఉన్న కోడి రామకృష్ణను పిలిచి ‘రామకృష్ణ ఈ నారింజ పండును పైకి విసురుతాను దీనిని నీవు నోటితో పట్టుకోవాలి పట్టుకుంటే ఈసినిమా సూపర్ హిట్ సరేనా’ అంటూ సవాలు విసిరాడట.
ఆయన పర్సనల్ లవ్ స్టోరీ కూడా..
అయితే అది రామకృష్ణకు తొలి సినిమా కావడంతో అప్పటికే టెన్షన్ లో ఉన్న రామకృష్ణ ఆ సవాల్ ను స్వీకరించి చిరంజీవి విసిరిన నారింజపండును లాంచి పై భాగం నుండి ముందుకు వొంగి చటుక్కున పట్టుకున్నాడట. దీనితో రామకృష్ణ చిరంజీవి విసిరినా పందెంలో విజయం సాధించడమే కాకుండా ఏకంగా ఆసినిమా ఒక సంవత్సరం ఆడి చిరంజీవి కెరియర్ లో మాత్రమే కాకుండా రామకృష్ణ జీవితానికి మలుపు తిప్పిన సినిమాగా మారి దాసరి తరువాత అత్యధిక సినిమాలు దర్శకత్వం వహించిన గొప్ప దర్శకుడుగా మార్చింది. అందుకే ఈయన మరణంతో ఇండస్ట్రీ ఒక లెజెండ్ ను కోల్పోయింది అంటూ ఇండస్ట్రీలోని వ్యక్తులు అంతా దుఃఖంలో మునిగి ఉన్నారు..



మరింత సమాచారం తెలుసుకోండి: