నిన్నరాత్రి హైదరాబాద్ జేఆర్సీలో జరిగిన కళ్యాణ్ రామ్ ’118’ మూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ ఎటువంటి హడావిడి లేకుండా సాదా సీదాగా జరిగింది. వాస్తవానికి ఈ ఫంక్షన్ వేదిక పై బాలకృష్ణతో పాటు జూనియర్ కళ్యాణ్ రామ్ లు కలిసి పాల్గొన్న వీరి ముఖాలలో అదేవిధంగా వేదిక పై వీరి ప్రవర్తనలో ఎటువంటి జోష్ కనిపించక పోవడంతో వీరిని ఇలా చూసిన నందమూరి అభిమానులు కూడ డీలా పడిపోయారు.
Nandamuri Balakrishna, Kalyan Ram and Jr NTR
ముఖ్యంగా ఇలాంటి ఫంక్షన్స్ కు వచ్చినప్పుడు తన మాటలలో తన నందమూరి కుటుంబం గొప్పతనం చెపుతూ భారీ పదాలతో ఉపన్యాసాలు ఇస్తూ ఉంటాడు. అయితే దీనికి భిన్నంగా బాలకృష్ణ నిన్నటి ఫంక్షన్ లో చాల తక్కువ మాట్లాడటమే కాకుండా చాలా సీరియస్ గా కనిపించాడు. 

ఈమూవీ నిర్మాతలకు మంచి లాభాలు రావాలి అని బాలకృష్ణ చెపుతూ ఈమూవీ పేరును ‘118’ కు బదులుగా ‘181’ అని పరధ్యానంతో అనడంతో కళ్యాణ్ రామ్ దగ్గరకు వచ్చి బాలకృష్ణ తప్పును సరిచేసాడు. బాలకృష్ణ ఈ ఫంక్షన్ జరుగుతున్నంత సేపు ఈ విషయాలు ఏమీ పట్టించుకోకుండా ఎదో లోకంలో ఉన్నట్లు అయోమయంగా అసహనంతో కనిపించడం స్పష్టంగా కనిపించింది. 
118-Theatrical-Trailer---Nandamuri-Kalyan-Ram,-Nivetha-Thomas,-Shalini-Pandey
దీనితో బాలయ్య మూడ్ ను పసిగట్టిన జూనియర్ కూడ తన పద్ధతికి విరుద్ధంగా చాల నీరసంగా ఎటువంటి చైతన్యం లేకుండా వేదిక పై కనిపించాడు. వీరిద్దరినీ ఇలా చూసిన కళ్యాణ్ రామ్ పరిస్థితి కూడ ఇలాగే మారిపోయింది. ఎక్కడా ఎటువంటి జోక్స్ సెటైర్లు లేకుండా జరిగిన ఈ ఫంక్షన్ ను చూసినవారు మాత్రం ఇది ‘118’ ప్రీ రిలీజ్ ఫంక్షన్ అనుకోవాలా లేదంటే ‘మహానాయకుడు’ ఫెయిల్యూర్ మీట్ అని భావించాలా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు టాక్. దీనితో బాలయ్య ఎన్టీఆర్ బయోపిక్ ఫెయిల్యూర్ ను ఏవిధంగా తట్టుకోలేకపోతున్నాడో  అర్ధం అవుతుంది..


మరింత సమాచారం తెలుసుకోండి: