తెలుగు సినిమా రంగంలోనే కాదు ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక శకాన్ని శాసించి చనిపోయి 24 సంవత్సరాలు అవుతున్నా ఇంకా తన చెరగని ముద్రను తెలుగు ప్రజలలో నిలుపుకుంటున్న నందమూరి తారక రామారావు ఇమేజ్ కి ఎన్టీఆర్ బయోపిక్ ఒక ఊహించని షాక్ ఇచ్చింది. ఇప్పటికీ రామారావు సినిమాలు బుల్లితెర పై వస్తే చాలు వేలాది సంఖ్యలో చూసే ప్రేక్షకులు ఎన్టీఆర్ బయోపిక్ ‘కథానాయకుడు’ ‘మహానాయకుడు’ విషయంలో అనుసరించిన తీరు ఎవరి ఊహలకు అందని విధంగా మారింది.
ntr-maha-nayakudu-release-in-confusion
‘కథానాయకుడు’ మూవీ కనీసం రెండు వారాలు అయినా ప్రదర్శింప గలిగితే ‘మహానాయకుడు’ మూవీ రెండవ వారానికే మన ఇరు రాష్ట్రాలలోను ఎత్తివేయవలసిన పరిస్థుతులు ఏర్పడ్డాయి. దీనితో పరువు పోతుందని గ్రహించిన తెలుగుదేశం అధినాయకత్వం ‘మహానాయకుడు’ మూవీని మరికొన్ని వారాలు ఆడే విధంగా ఆమూవీ టిక్కెట్లు అన్నీ ఏ ఊరుకు ఆఊరులోని తెలుగుదేశం నాయకులను కొని ఆసినిమా ప్రదర్శింపబడేలా సహకరించమని తెలుగుదేశం అధినాయకత్వం స్పష్టమైన ఆదేశాలు ఇచ్చినట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.
Balakrishna as NTR in NTR Mahanayakudu
దీనితో రంగంలోకి దిగిన తెలుగుదేశం నాయకులు ‘మహానాయకుడు’ టిక్కెట్లు కొని ఆ టిక్కెట్ల ఉచిత పంపిణి కార్యక్రమాలు చేపడుతున్నట్లు సమాచారం. తెలుస్తున్న సమాచారం మేరకు ‘మహానాయకుడు’ టిక్కెట్లను ప్రతి ఊరులోను ఉండే జర్నలిస్టులకు డాక్టర్లకు లాయర్లకు మేధావులకు మరీ ముఖ్యంగా డ్వాక్రా గ్రూప్ మహిళకు ఉచితంగా ఇస్తున్నా ఆ టిక్కెట్స్ ను తీసుకుని వారంతా సినిమా ధియేటర్స్ వరకు రావడానికి ఆసక్తి కనపరచడం లేదు అని టాక్. 
Ntr-mahanayakudu.jpg
దీనితో షాక్ అయిన తెలుగుదేస వర్గాలు వారిని ఏదోవిధంగా ‘మహానాయకుడు’ షో చూడటానికి రమ్మని ఆహ్వానిస్తూ పిలుపులు పిలుస్తున్నా ఆ పిలుపుకు సరైన స్పందన లేకపోవడం తెలుగుదేశం వర్గాలకు జీర్ణించుకోలేని అవమానంగా మారిందని టాక్. దీనితో ఎన్నికల సమయంలో బాలకృష్ణ ఎన్టీఆర్ బయోపిక్ ను తీసి అనవసరంగా తాను అవమాన పడటమే కాకుండా ఎన్టీఆర్ లాంటి గొప్ప వ్యక్తి ఖ్యాతికి అనుకోకుండా అమవానం కలిగేలా పరిస్థుతులు మారాయా అంటూ తెలుగుదేశం కార్యకర్తలు తీవ్ర అంతర్మధనంలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి..  
 


మరింత సమాచారం తెలుసుకోండి: