తెలుగు ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీ నుంచి హీరోలు వస్తున్న తరుణంలో మెగా బ్రదర్ నాగబాబు కూతురు కొణిదెల నిహారిక ‘ఒకమనసు’చిత్రంతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చింది.  ఆ తర్వాత రెండు చిత్రాల్లో నటించినా పెద్దగా కలిసి రాలేదు.  తమిళంలో నటించి చిత్రానికి మంది మంచి స్పందన వచ్చినా..ఈ అమ్మడు తెలుగు లో సెటిల్ అవ్వాలనే ఆలోచనలో ఉంది. ఇండస్ట్రీకి ఎంట్రీ ఇవ్వక ముందు బుల్లితెరపై తన సత్తా చాటిన నిహారిక కొన్ని షార్ట్ ఫిలిమ్స్ లో కూడా నటించింది. 
Image result for niharika suryakantham posters
తనకి తగిన పాత్రలను మాత్రమే ఎంచుకుంటూ ముందుకు వెళుతోంది. ఆమె తాజా చిత్రంగా 'సూర్యకాంతం' రూపొందుతోంది. ఈ చిత్రంలో రాహూల్ విజయ్ హీరోగా నటిస్తున్నాడు. ఈ సినిమాకి ప్రణీత్ దర్శకుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ చిత్రానికి సంబంధించిన టీజర్, ఫస్ట్ లుక్, లిరికల్ సాంగ్స్ సోషల్ మీడియాలో మంచి స్పందన వచ్చింది. 
Image result for niharika suryakantham posters
తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన మరో పాటను విడుదల చేయడానికి రంగాన్ని సిద్ధం చేశారు. రేపు ఉదయం 11 గంటలకు ఈ పాటను నాగచైతన్య చేతుల మీదుగా విడుదల చేయిస్తున్నారు.  ఈ చిత్రంలో నిహారిక విలక్షణమైన పాత్రను పోషిస్తోందనీ, ఈ సినిమా ఆమెకి మంచి పేరు తెస్తుందనే టాక్ బలంగా వినిపిస్తోంది


మరింత సమాచారం తెలుసుకోండి: