‘సాహో’ విడుదల కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న ప్రభాస్ అభిమానులకు ఊహించని నిరాశ ఎదురౌతున్నట్లు సమాచారం. ఇక వివరాలలోకి వెళితే రేపు విడుదల కాబోతున్న ‘సాహో చాప్టర్ 2’ కు సంబంధించిన వార్త ఇది. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ చాప్టర్ 2లో ప్రభాస్ కు సంబంధించిన సన్నివేశాలు ఏమి ఉండవని తెలుస్తోంది. 
Prabhas in Saaho
ఈ చాప్టర్ 2కు సంబంధించిన టీజర్ అంతా హీరోయిన్ శ్రద్ధా కపూర్ చుట్టూ తిరుగుతుందని సమాచారం. ఈ టీజర్ కేవలం ఒకటిన్నర నిముషం ఉండే విధంగా స్మాల్ వీడియోగా విడుదల చేయబోతున్నట్లు తెలుస్తోంది. మార్చి 3 స్రద్దాకాపూర్ పుట్టినరోజు అయిన సందర్భంగా ఈ వీడియోను విడుదల చేస్తున్నట్లు టాక్. 
Saaho movie first look.jpg
ఈ వీడియో అంతా ‘సాహో’ లో శ్రద్దా కపూర్ చేసే ధైర్యవంతమైన ఫైట్స్ మాత్రమే కనిపిస్తాయని ఈ టీజర్ లో కూడ ఎక్కడా ‘సాహో’ సినిమా కథకు సంబంధించిన లీకులు ఉండవని సమాచారం. ఎప్పటి నుంచో ‘సాహో చాప్టర్ 2’ గురించి ప్రభాస్ అభిమానులు ఎదురు చూస్తున్న నేపధ్యంలో ప్రభాస్ ప్రస్తావన లేకుండా విడుదల కాబోతున్న చాప్టర్ 2 విషయాలు తెలిసి పెదవి విరుస్తున్నట్లు తెలుస్తోంది. 
Saaho Teaser Release
వాస్తవానికి ఈమూవీ విడుదల తేదీని ఆగష్టు 15నుగా ఖరార్ చేస్తూ ‘సాహో’ మేకర్స్ ప్రకటించినప్పటికీ ఈమూవీకి పోటీగా ‘సైరా’ వస్తుంది అని వస్తున్న వార్తలు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారడంతో నిజంగానే ప్రభాస్ చిరంజీవిల మధ్య పోటీ ఉంటుందా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే తెలుస్తున్న సమాచారం మేరకు ఇలాంటి అనవసరపు పోటీకి చిరంజీవి అంగీకరించడు అనీ కేవలం ‘సైరా’ మార్కెట్ స్పీడ్ అందుకోవడానికి ఇలాంటి లీకులు ఇస్తున్నారు అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి..


మరింత సమాచారం తెలుసుకోండి: