వచ్చే నెలలో మన తెలుగు రాష్ట్రాలలో జరగబోతున్న ఎన్నికల వేడి ఆ ఎన్నికలు ఇంకా సమీపించకుండానే మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికలు వచ్చే ఆదివారం మార్చి 10వ తారీఖున జరగబోతున్నాయి. అయితే ఈసారి కూడ ఎన్నికలు సాధారణ వాతావరణంలో జరగకుండా సాధారణ ఎన్నికల స్థాయిని గుర్తుకు చేస్తూ పోటాపోటీగా జరగడమే కాకుండా మరొకసారి టాలీవుడ్ ఇండస్ట్రీలోని భేధాభిప్రాయాలను వెలుగులోకి తీసుకు వస్తూ ఇండస్ట్రీలోని అగ్రనటుల ఆదిపత్యానికి పరోక్ష వార్ గా ‘మా’ ఎన్నికల హడావిడి జరగబోతోంది అన్న కామెంట్స్ వస్తున్నాయి. 

తెలుస్తున్న సమాచారం మేరకు ఈసారి జరగబోతున్న ఈ ఎన్నికలలో శివాజీ రాజా సీనియర్ నరేష్ ప్యానల్స్ మధ్య వార్ గా మారింది. ‘మా’ అధ్యక్ష స్థానానికి నరేశ్ శివాజీ రాజాల మధ్య గట్టిపోటీ జరుగుతున్న నేపధ్యంలో మూవీ ఆర్టిస్ట్ సభ్యులు కూడ రెండు వర్గాలుగా విడిపోవలసిన పరిస్థితి ఏర్పడింది అని అంటున్నారు. 

దీనికితోడు నరేశ్ ప్యానల్ లో జీవిత రాజశేఖర్ చేరడంతో పాటు ఆమె అప్పుడే ‘మా’ అసోషియేషన్ తీరు పై ఘాటైన విమర్శలు చేయడం మొదలుపెట్టేసింది. ‘మీటూ’ ఉద్యమానికి సంబంధించి కాని చిన్న నటీనటుల సమస్యల గురించి కాని ప్రస్తుతం ‘మా’ సంస్థ పట్టించుకోలేని పరిస్థితిలో ఉండటంతో తాను నరేష్ తో కలిసి ఒక ప్యానల్ గా పోటీకి దిగుతున్న విషయాలను వివరించింది.

శివాజీరాజ ప్యానల్ లో శ్రీకాంత్ రఘుబాబులు లాంటి చాలామంది సీనియర్స్ ఉన్నారు. దీనికితోడు ఇండస్ట్రీ టాప్ హీరోలు బయటకు తమకు ఈ ఎన్నికలతో సంబంధం లేదు అని చెపుతున్నా లోలోపల తమ వ్యక్తిగత ఆధిపత్యం కోసం ఈసారి కూడ ‘మా’ ఎన్నికలను మరొకసారి అస్త్రంగా మార్చుకోబోతున్నారు అని వార్తలు వస్తున్న నేపధ్యంలో ఫిలింనగర్ కృష్ణానగర్ ప్రాంతం అంతా ‘మా’ సంస్థ ఎన్నికల హడావిడితో హోరెత్తి పోతోంది అని వార్తలు వస్తున్నాయి..  



మరింత సమాచారం తెలుసుకోండి: