మొన్న విడుదలైన ‘సాహో చాప్టర్ 2’ కు ఒకే ఒక్కరోజు పూర్తి కాకుండానే కోటి వ్యూస్ రావడం ఒక సంచలనం అయితే ఆ సంచలనం మర్చిపోకుండానే ప్రభాస్ ను ఎయిర్ పోర్ట్ లో ఒక అమ్మాయి కలిసి సెల్ఫీ తీయించుకుని  వెంటనే ఆ అమ్మాయి సంబరంలో ఎగిరి గంతేస్తూ ప్రభాస్ చెంప పై సున్నితంగా చెంపదెబ్బ కొట్టిన విషయానికి సంబంధించిన న్యూస్ ఇప్పుడు ప్రభాస్ అభిమానుల మధ్య వైరల్ గా మారింది. 
Prabhas Birthday Will Be Special: Find Out Why
అయితే ఈ సంఘటన ఎప్పుడు జరిగింది ఎక్కడ జరిగింది అన్న విషయం క్లారిటీ లేకపోయినా ప్రభాస్ వీరాభిమాని ఈరోజు సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో వల్ల ఈవిషయం బయటపడింది. ఎయిర్ పోర్ట్ లో ప్రభాస్ ను చూసిన ఒక అమ్మాయి ప్రభాస్ దగ్గరకు వెళ్లి సెల్ఫీ కోసం రిక్వెస్ట్ చేసింది.
Prabhas
ప్రభాస్ నవ్వుతు తనతో ఫోటో తీయించుకోవడానికి ఆ అమ్మాయికి అంగీకారం చెప్పగానే ఆ ఫోటో కార్యక్రమం పూర్తి అయింది. అయితే వెంటనే ప్రభాస్ కు థాంక్స్ చెప్పిన ఆ అమ్మాయి నవ్వుతు వెళ్ళిపోతూ ఒక్క ఎగురు ఎగిరి ప్రభాస్ బుగ్గ పై సున్నితంగా చెంప దెబ్బ కొట్టడంతో ఒక్క క్షణం పాటు ప్రభాస్ ఆశ్చర్యపోయిన పరిస్థితి ఆ ఎయిర్ పోర్ట్ లో అందరికీ స్పష్టంగా కనిపించింది. 

అయితే ఆ సంఘటన నుండి నవ్వుతూ వెంటనే తేరుకున్న ప్రభాస్ మిగతా అభిమానులకు సెల్ఫీ పోజులు ఇచ్చాడు. అమ్మాయిల డార్లింగ్ గా పిలవబడే ప్రభాస్ క్రేజ్ కు ఈ సంఘటన ఒక ఉదాహరణ. ఈ క్రేజ్ తగ్గిపోతుంది అని కాబోలు ప్రభాస్ తన పెళ్ళి విషయంలో ఆలస్యం చేస్తున్నాడు అనుకోవాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: