ఈ మద్య హర్రర్ కాన్సెప్ట్ తో ఎక్కువగా చిత్రాలు వస్తున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో భరత్‌, సృష్టిడాంగే, ఇనియ, నమిత ప్రధాన పాత్రల్లో నటించిన ‘బొట్టు’చిత్రం  వచ్చే శుక్రవారం విడుదల చేయబోతున్నట్టు నిర్మాణ సంస్థ షాలోమ్‌ స్టూడియోస్‌ ప్రకటించింది.  వాస్తవానికి ఈ చిత్రం గత యేడాది రిలీజ్ కావాల్సి ఉన్నా కొని అనివార్య కారణాల వల్ల రిలీజ్ కి నోచుకోలేదు. 

ఈ మద్య ‘బొట్టు’కి సంబంధించి ట్రైలర్ రిలీజ్ చేశారు.  గ్రాఫిక్స్ పరంగా  ఈ చిత్రం బాగానే ఆకర్షిస్తుంది.  దెయ్యం కథతో వరుసగా చిత్రాలు తీస్తున్న దర్శకుడువడివుడయన్‌ తెరకెక్కించిన ఈ చిత్రంలో భరత్‌, ఇనియ ఇద్దరూ దెయ్యం పాత్రల్లో కనిపించనుండగా, శృంగారతార నమిత మంత్రవాదిగా నటించింది. 

ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ భాషల్లో రిలీజ్ చేయనున్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.  వైద్యం పేరుతో అమాయక ప్రజల్ని మోసం చేస్తున్న ఉదంతాల ఆధారంగా ‘బొట్టు’ తెరకెక్కగా, దాదాపు వెయ్యి థియేటర్లలో విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు.



మరింత సమాచారం తెలుసుకోండి: