మహేష్ సుకుమార్ ల మధ్యజరిగిన వ్యూహాత్మక వార్ లో దెబ్బతిన్నది మాత్రం పూర్తిగా మైత్రీమూవీస్ అనే మాటలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం తాము తీస్తున్న సినిమాల వరస పరాజయాల మధ్య విపరీతమైన ఆర్ధిక నష్టాలలో కూరుకు పోయిన మైత్రీమూవీస్ మహేష్ సుకుమార్ ల మూవీ ప్రాజెక్ట్ తో కొంత తెరిపిన పడాలని భావించింది. అయితే వారి ఎత్తుగడలకు అనుకోకుండా చెక్ పడడంలో అల్లు అర్జున్ త్రీ యాంగిల్స్ స్టోరీ కీలక పాత్ర పోషించింది అని వార్తలు వస్తున్నాయి.
Allu Arjun in Naa Peru Surya
వాస్తవానికి ‘ఎఫ్ 2’ విడుదలకు ముందు అనీల్ రావిపూడి అల్లు అర్జున్ ను కలిసి ఒకకథను చెప్పాడని తెలుస్తోంది. అయితే ఈకథ విషయమై బన్నీ తననిర్ణయం చెప్పడంలో ఆలస్యం చేస్తున్న నేపధ్యంలో అసహనానికి గురైన అనీల్ రావిపూడి ‘ఎఫ్ 2’ విడుదల తరువాత మహేష్ ను కలిసి గతంలో బన్నీకి తాను చెప్పిన కథనే కొన్ని మార్పులు చేసి చెప్పడం మహేష్ అంగీకారం తీసుకోవడం జరిగిపోయింది అంటారు. దీనితో అనీల్ రావిపూడితో తాను చేయాలి అనుకున్న కథను మహేష్ ఎత్తుకు పోవడంతో బన్నీకి మహేష్ పై కొంత అసహనం వచ్చినట్లు టాక్. 
Allu Arjun in Naa Peru Surya Naa Illu India
ఇలాంటి పరిస్థుతులలో అనుకోకుండా మహేష్ వ్యవహార శైలి పై అసంతృప్తిగా ఉన్న సుకుమార్ తనను కలవడంతో మహేష్ కు ఊహించని విధంగా చెక్ పెట్టాలని మరొక ఆలోచన లేకుండా వెంటనే బన్నీ సుకుమార్ సినిమాను ఒప్పుకున్నాడు అన్నప్రచారం జరుగుతోంది. ఇలా అల్లు అర్జున్ ఒక షాకింగ్ నిర్ణయం తీసుకోవడం పరోక్షంగా త్రివిక్రమ్ కు కూడ వార్నింగ్ బెల్స్ ఇవ్వడం కూడ అని అంటున్నారు. త్రివిక్రమ్ తో అల్లు అర్జున్ చేయవలసిన మూవీ కథ సెకండ్ ఆఫ్ విషయంలో బన్నీ త్రివిక్రమ్ ల మధ్య భేదాభిప్రాయాలు వచ్చాయని ఇప్పటికే గాసిప్పులు హడావిడి చేస్తున్నాయి. 
allu-arjun-action-movies
దీనితో బన్నీ సలహాలకు అనుగుణంగా త్రివిక్రమ్ ఈమూవీ కథలో మార్పులు చేసే విషయంలో ఆలస్యం చేస్తే తాను వెంటనే సుకుమార్ వైపు వెళ్ళిపోతానని బన్నీ త్రివిక్రమ్ కు ఇచ్చిన వార్నింగ్ బెల్స్ కూడ ఈవిషయంలో ఉన్నాయి అన్నప్రచారం జరుగుతోంది.దీనికితోడు ‘రంగస్థలం’ తరువాత అల్లు అర్జున్ మైత్రీమూవీస్ సంస్థలో నటించాలని ప్రయత్నించినా వారి దృష్టి మహేష్ పై ఉండటంతో బన్నీ ఆలోచనలు సఫలం కాలేదు. అయితే ఇప్పుడు మైత్రీ మూవీస్ మహేష్ ల మధ్య వ్యవహారం బెడిసి కొట్టడంతో బన్నీ అనుకోకుండా సీన్ లోకి వచ్చాడు. ఇలా అల్లు అర్జున్ అనుసరించిన త్రిముఖ వ్యూహాలు ఇప్పుడు ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారి బన్నీ తెలివితేటల పై ఆసక్తికర చర్చలు జరుగుతున్నాయి..   


మరింత సమాచారం తెలుసుకోండి: