మహిళా లోకం మరోకసారి మహిళా దినోత్సవం వైపు అడుగులు వేస్తున్న నేపధ్యంలో ప్రపంచ జనాభాలో సగభాగంలో కొనసాగుతున్న మహిళాభ్యుదయం పై ప్రపంచ వ్యాప్తంగా మరొకసారి చర్చలు జరుగుతూ వివిధ రంగాలలో ప్రముఖ స్థానంలో కొనసాగుతున్న మహిళలను స్పూర్తిగా తీసుకోవాలని మహిళా లోకానికి సందేశాలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థుతులలో ప్రపంచం యావత్తు వ్యాపార సంస్కృతి పెరిగిపోవడంతో మహిళలను ఆకర్షించేలా ప్రకటనలు కూడ వస్తున్నాయి. 
International Women's Day 2018: History, Theme, Celebration And Significance
వాస్తవానికి ప్రపంచ వ్యాప్తంగా మహిళ ప్రాధాన్యతను గుర్తిస్తూ 1960 ప్రాంతం నుండి మహిళల అభ్యున్నతికోసం అటు ప్రభుత్వాల నుండి ఇటు సామాజిక సంస్థల వరకు మనదేశంలో మహిళలకోసం ప్రత్యేక కార్యక్రమాలు ప్రత్యేక ప్రభుత్వ సంస్థలు ప్రత్యేక విధ్యా సంస్థలు ఏర్పాటు చేయడం జరిగింది. ఆతరువాత 1966లో మొట్టమొదటిసారిగా ఒకమహిళ ఇందిరాగాంధీ భారత ప్రధానమంత్రి కావడంతో ఇండియాలో మహిళల పరిస్థితిలో అనూహ్యమమైన మార్పులు వస్తాయని అప్పట్లో అందరూ భావించారు. 
అందమైన పువ్వులు ఫోటో రోజు 8/3 సంవత్సరం 2016-2017
అయితే మహిళల సమస్యలలో మార్పులు అప్పట్లో అంతగా రాకపోయినా విద్య వైజ్ఞానిక రంగాలలో 1970 ప్రాంతం నుండి అనేక అనూహ్య మార్పులు జరిగి పురుషులతో స్త్రీలు పోటీ పడుతూ అనేక పరీక్షలలో అమ్మాయిలు అబ్బాయిల కంటే ఎక్కువ మార్పులు ఎక్కువ ఉత్తీర్ణత శాతం పొందే విషయంలో అమ్మాయిలు వేసిన ముందడుగు ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. ఒక అధ్యయనం ప్రకారం అనేక మల్టీ నేషనల్ కంపెనీలు కీలక నిర్ణయాలు తీసుకునే శాఖలలో పురుషుల కంటే స్త్రీలు తమ ధృఢ వైఖరితో రాణిస్తున్న నేపధ్యంలో అనేక ప్రముఖ కంపెనీలు కీలక విషయాలలో నిర్ణయాలు తీసుకునే ఉద్యాగాలలో మహిళలకే ప్రాధాన్యత ఇస్తున్నారు అంటే మహిళా శక్తి గొప్పతనం మరొకసారి ఋజువు అవుతోంది.
Womens-Day-
అయితే ఎన్నో మార్పులు చోటుచేసుకుంటున్నా మనదేశంలో ఇప్పటికీ ప్రతిరోజు ప్రతి ఐదు నిముషాలకు ఎక్కడో అక్కడ స్త్రీల పై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయి అని ఒక మీడియా సంస్థ చెప్పింది అంటే స్త్రీ ఎంత అభివృద్ధి సాధించినా పురుషాధిక్య ప్రపంచంలో ఇప్పటికీ ఎలా తనను తాను కాపాడుకోలేకపోతోందో అర్ధం అవుతోంది. అయితే ఒకవైపు భారతదేశ జనాభాలో మహిళల జనాభా నెమ్మదినెమ్మదిగా తగ్గుతూ ఉండటం దీనికితోడు ప్రస్తుతం మంచి ఉద్యోగాలు చేస్తూ మంచి సంపాదన సంపాదిస్తున్న అమ్మాయిలలో పెళ్ళి పట్ల నిర్లిప్తత పెరుగుతున్న నేపధ్యంలో రానున్న రోజులలో ఈ నిర్లిప్తత అనేక సామాజిక సమస్యలకు దారి తీసే అవకాసం ఉంది. స్త్రీని దేవతగా పూజించే మన దేశంలో స్త్రీల పై అన్ని విధాల అణిచివేతలు పెరిగిపోతున్న నేపధ్యంలో మార్పును ఆశిస్తూ మరో మహిళా దినోత్సవానికి స్వాగతం.. 


మరింత సమాచారం తెలుసుకోండి: