మే నెల పేరు చెపితే మహేష్ ఉలిక్కిపడతాడు. మహేష్ కెరియర్ కు సంబంధించిన భయంకరమైన ఫ్లాప్ లు అన్నీ మే నెలలోనే విడుదల అయ్యాయి. ఇలాంటి పరిస్థితిలలో తన లేటెస్ట్ మూవీ ‘మహర్షి’ ని ఏప్రియల్ లో విడుదల చేసి ఆ మే నెల నెగిటివ్ సెంటిమెంట్ నుండి తప్పించుకుందామని మహేష్ చేసిన ఎన్నో ప్రయత్నాలు ‘మహర్షి’ విషయంలో కలిసిరాలేదు. 
మహేష్ కెరీర్‌లో బెస్ట్ మూవీ
ఈమూవీకి సంబంధించిన కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటిస్తూ దిల్ రాజ్ నిర్మాత అశ్వనీదత్ కు సంబంధించిన సెంటిమెంట్ ను ‘మహర్షి’ రిలీజ్ డేట్ కు అన్వయిస్తూ మహేష్ మే సెంటిమెంట్ కు పాజిటివ్ సెంటిమెంట్ వచ్చేలా తన వంతు ప్రయత్నం చేసాడు. ‘మహర్షి’ సినిమాకు మరొక నిర్మాత అయిన అశ్వినీ దత్ చిరంజీవితో తీసిన ‘జగదీకవీరుడు అతిలోక సుందరి’ మే 9న విడుదల అయి చరిత్ర సృష్టించిన విషయాన్ని గుర్తుకు చేస్తూ అదే సెంటిమెంట్ తో గత సంవత్సరం మే 9న విడుదలైన ‘మహానటి’ మరో చరిత్ర సృష్టించిన విషయాన్ని కూడ గుర్తుకు చేస్తూ కలిసి వచ్చిన ఈ రెండు సినిమాల రిలీజ్ డేట్ సెంటిమెంట్ ‘మహర్షి’ సినిమాకు కలిసి వస్తుందని తన నమ్మకం అంటూ కామెంట్స్ చేసాడు. 
అశ్విని దత్ సెంటిమెంట్
అంతేకాదు దిల్ రాజ్ మరొక ట్విస్ట్ ఇస్తూ తాను నిర్మించిన ‘బద్ర’ ‘పరుగు’ ‘ఆర్య’ సినిమాలు కూడ మే నెలలోనే విడుదలలై సూపర్ హిట్ అయిన నేపధ్యంలో ఇన్ని సూపర్ హిట్ సినిమాల సెంటిమెంట్ తమ ‘మహర్షి’ కి కలిసి వస్తుంది అని చెపుతూ మహేష్ మేనెల నెగిటివ్ సెంటిమెంట్ ను అభిమానులు మర్చిపోయేలా తన వంతు ప్రయత్నాలు చేసాడు. దీనితో ఈ మీడియా సమావేశానికి వచ్చిన చాలామంది మీడియా వర్గాలు మహేష్ నెగిటివ్ సెంటిమెంట్ ను కవర్ చేయడానికి దిల్ రాజ్ చిరంజీవి సెంటిమెంట్ ను ఆయుధంగా మార్చాడా అంటూ కామెంట్స్ చేసుకున్నట్లు తెలుస్తోంది.
A still from Maharshi teaser, featuring Mahesh Babu. YouTube screengrab
వాస్తవానికి మహేష్ కు ఉన్న నమ్మకాల రీత్యా ‘మహర్షి’ ని ఎదో విధంగా ఏప్రియల్ 25న విడుదల చేయాలని ప్రయత్నించినా ఈమూవీ షూటింగ్ ఏప్రియల్ 15 వరకు ఇంకా కొనసాగే పరిస్థుతులతో మహేష్ రాజీ పడిపోయినట్లు టాక్. ఇలాంటి పరిస్థుతులలో ఇప్పటికే ఈమూవీ అవుట్ పుట్ విషయంలో ఎక్కడో ఎదో తేడా జరిగింది అని గాసిప్పులు వస్తున్న నేపధ్యంలో మెగా స్టార్ సెంటిమెంట్ ఎంత వరకు మహేష్ నెగిటివ్ సెంటిమెంట్ కు విరుగుడు వైద్యంగా పని చేస్తుందో చూడాలి..  


మరింత సమాచారం తెలుసుకోండి: