క్రియేటివ్ సినిమాలకు చిరునామాగా కొనసాగిన క్రిష్ కు ఎన్టీఆర్ బయోపిక్ ఇచ్చిన షాక్ నుండి తేరుకునే అవకాశాలు వచ్చినా క్రిష్ ఆ అవకాశాలను సద్వినియోగ పరుచుకోలేక పోవడం ఇండస్ట్రీ హాట్ టాపిక్ గా మారింది. సాధారణంగా భారీ అంచనాలు ఉండే సినిమాకు దర్శకత్వం వహించిన దర్శకుడుకి ఆమూవీ ఫెయిల్ అయితే ఎవరూ ఇండస్ట్రీలో అవకాశాలు ఇవ్వరు.
Krish Director wiki
అయితే క్రిష్ కు పరాజయం వచ్చినా క్రిష్ తో సినిమా తీయాలని నాగార్జున అదేవిధంగా ‘బాహుబలి’ నిర్మాతలు క్రిష్ తో సంప్రదింపులు జరుపుతూ ఉన్నా క్రిష్ ఆ సంప్రదింపులకు స్పందించడం లేదు అని టాక్. అంతేకాదు తాను ఎటువంటి కథతో అదేవిధంగా ఏహీరోతో సినిమాను తీస్తే బాగుంటుందో తనకే తెలియని కన్ఫ్యూజన్ లో ఉన్నానని కొంత కాలం తాను సినిమాలకు దూరంగా ఉండాలని అభిప్రాయ పడుతున్నాను అంటూ తనతో సినిమాలు చేయమని ఆఫర్లు ఇస్తున్న నిర్మాతల మైండ్ ను క్రిష్ తన సమాధానంతో మైండ్ బ్లాంక్ చేస్తున్నట్లు సమాచారం.
Krish Director wiki
స్వతహాగా సున్నిత మనస్కుడైన క్రిష్ ‘మణికర్ణిక’ విషయంలో ఎన్టీఆర్ బయోపిక్ విషయంలో తనకు ఎదురైనా అవమానాన్ని ఇప్పటికీ మర్చిపోలేకపోతున్నాడు అని టాక్. దీనికితోడు క్రిష్ వైవాహిక జీవితంలో ఎదురైన సమస్యలు కూడ క్రిష్ ను మానసికంగా దేబ్బతీసినట్లు గాసిప్పులు హల్ చల్ చేస్తున్నాయి.
Krish’s next Aham Brahmasmi with Star hero
వాస్తవానికి క్రిష్ దగ్గర కథలకు కొరత లేదనీ నాలుగు ఐదు స్టోరీ లైన్స్ తన దగ్గర రెడీగా ఉన్నా వాటిని డెవలప్ చేసి అటు నిర్మాతలతో పాటు ఇటు హీరోలను ఒప్పించే విషయంలో ప్రస్తుతం క్రిష్ కొంత నైరాశ్యంలో ఉన్నట్లు టాక్. ‘మణికర్ణిక’ లాంటి సినిమాకు రెండు సంవత్సరాలు కష్టపడి సినిమా తీయడమే కాకుండా ఆసినిమాలో సుమారు 70 శాతం దర్శకత్వం వహించి కూడ చిన్న మాట తేడాకు ‘మణికర్ణిక’ ను వదులుకుని ఎన్టీఆర్ బయోపిక్ ను నమ్ముకున్న విషయంలో తాను తప్పు చేసానా అన్న అంతర్మధనంలో ఉన్న క్రిష్ ప్రస్తుతం ఇండస్ట్రీకి సంబంధించిన ఎవర్ని కలవడానికి అంతగా ఇష్టపడటం లేదని ఫిలింనగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.. 


మరింత సమాచారం తెలుసుకోండి: