తెలుగు, తమిళ ఇండస్ట్రీలో ఎప్పుడూ కాంట్రవర్సీలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ సొంతం చేసుకున్న రాంగోపాల్ వర్మ ప్రస్తుతం లక్ష్మీస్ ఎన్టీఆర్ చిత్ర నిర్మాణంలో ఉన్నారు.   ఈ చిత్రానికి సంబంధించి ప్రతిరోజూ ఏదో ఒక అంశం ప్రస్తావిస్తూ విపరీతమైన ప్రమోషన్స్ చేస్తున్నారు.  ఇటీవల లికర్ సాంగ్స్, టీజర్ రిలీజ్ చేసి అందరి దృష్టి ఆకర్షించారు.  ఇండస్ట్రీకి వచ్చిన కొత్తలో వర్మ కామెడీ, హర్రర్, మాఫియా తరహా చిత్రాలు తీసేవారు.  రాంగోపాల్ వర్మ తీసే చిత్రంలో ఎక్కువగా వాయిలెన్స్ ఉంటుందని టాక్. 
Image result for laxmi ntr movie
ఇక రీల్ లైఫ్ లో కాదు..రియల్ లైఫ్ లో కూడా రాంగోపాల్ వర్మ చాలా సీరియస్ గా ఉంటారని..అంతా నా ఇష్టం అనే టైప్ అని అంటారు. పలు ఛానల్స్ లో ఇంటర్వ్యూలో కూడా ఆయన ఇదే విధంగా ప్రవర్తింటారు.   ఆయనకు దేవుడంటే గిట్టదని..అస్సలు ఎమోషన్స్ ఉండవని అంటారు.  కానీ ఈ మద్య ఆయన వెంకన్నను దర్శించుకొని అందరికీ షాక్ ఇచ్చారు.   

ఆయనకు ఎక్కువ ఎమోషన్స్ ఉంటాయని వర్మ తల్లి కూడా చెబుతుంటారు. ఇకపోతే రీసెంట్ గా వర్మ తన మేన కోడలితో కనిపించి అందరికి షాక్ ఇచ్చాడు.   తాజాగా రాంగోపాల్ వర్మ లో కొత్త కోణం వెలుగులోకి వచ్చింది.  తన కండలు ఆమె ముందు చిన్నబోయాయి అంటూ ఆమెన్ గెలిచింది నేను ఓడాను అని మేనకోడలు శ్రావ్య వర్మతో ఉన్న ఫోటోను వర్మ పోస్ట్ చేశారు.  శ్రావ్య ఫ్యాషన్ డిజైనర్... వర్మపై కూడా ఆమె అప్పుడపుడు -ప్రయోగాలు చేస్తుంటారు. ఇక రీసెంట్ గా వారు కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 

మరింత సమాచారం తెలుసుకోండి: