మోహన్ బాబు నటనా వరసత్వాన్ని మాత్రమే కాకుండా అతడి ఆవేశాన్ని కూడ వరసత్వంగా తీసుకుకుని మంచు లక్ష్మి ఇండస్ట్రీ లోని ఆ నలుగురి ఆది పత్యాన్ని ప్రశ్నిస్తూ చేసిన కామెంట్స్ ఇప్పడు ఇండస్ట్రీ వర్గాలలో సంచలనంగా మారాయి. ‘మిసెస్ సుబ్బలక్ష్మి’ అనే వెబ్ సిరీస్ లాంఛ్ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్ మీట్ లో మంచు లక్ష్మి ఇలా ఒకేసారి ఉప్పెనలా టాలీవుడ్ ఫిలిం  ఇండస్ట్రీలోని ఆ నలుగురి ని టార్గెట్ చేస్తూ చేసిన కామెంట్స్ వెనుక ఆంతర్యం ఏమిటి అన్న కోణంలో ఇప్పడు చర్చలు జరుగుతున్నాయి. 
వారి చేతుల్లోనే థియేటర్లు... మోహన్ బాబు కూతురు అని చూడరు
పరిశ్రమకు చెందిన కొన్ని వివాదాస్పద విషయాల పై మోహన్ బాబు ఉగ్రరూపం ప్రదర్శిస్తూ కామెంట్స్ చేయడం సర్వసాధారణమే అయినా ఇప్పుడా బాధ్యతను కూతురు మంచు లక్ష్మి తీసుకుందా అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక వివరాలలోకి వెళ్ళితే మంచు లక్ష్మీ తన సినిమాలకు థియేటర్లు దొరకడం లేదంటూ ఆరోపణలు చేస్తోంది. 
కథలతో ప్రయోగాలు చేయడానికి చాలా ఫ్రీడం ఉంటుంది
రాత్రి పగలు కష్టపడి సినిమాలు తీస్తే  ఏదో సినిమా వస్తుందని తమ సినిమా పీకేస్తున్నారు అంటూ ఆమె ఆరోపణలు చేస్తోంది. అంతేకాదు తెలుగు రాష్ట్రాలలో థియేటర్స్ అన్ని ఐదారుగురి చేతిలో ఉన్నాయి అని అంటూ మోహన్ బాబు కూతురు సినిమా కాబట్టి ఒక వారం రోజులైనా థియేటర్లలో ఉంచుదామనే ఆలోచన ఎవరికిలేదు అంటూ ఆమె ఆవేశంతో చేసిన కామెంట్స్ ను బట్టి మంచు లక్ష్మికి కూడా అబద్రతా భావం పెరిగి పోతోందా అన్న సందేహాలు కలుగుతున్నాయి.
భవిష్యత్తులో వీటి హవా నడుస్తుంది
గతంలో తాను నటించిన చాల సినిమాలకు మంచి టాక్ వచ్చినా ఆసినిమాలు నిలదోక్కుకోకుండానే ధియేటర్ల నుండి కొందరి వ్యక్తుల వల్ల తొలిగించారు అంటూ ఆమె ఆవేదన వ్యక్త పరిచింది. అయితే వాస్తవానికి ఎటువంటి సపోర్ట్ లేకుండా విడుదలైన చాల చిన్న సినిమాలు ఘన విజయం సాధించిన విషయాలు మంచు లక్ష్మికి తెలియదా లేదంటే తన తండ్రి వయసు రీత్యా పెద్దవాడు అవుతున్నాడు కాబట్టి ఇండస్ట్రీని టార్గెట్ చేసే విషయంలో తన తండ్రి వారసత్వాన్ని కొనసాగించడానికి ఇలా కామెంట్స్ చేసిందా అన్న కోణంలో ఆ మీడియా సమావేశానికి వచ్చిన చాలామంది కామెంట్స్ చేసుకున్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: