చరణ్‌ పవన్‌ ల పక్కన నటించిన శృతిహాసన్ చిరంజీవితో రొమాన్స్ చేయడానికి అంగీకరించింది అంటే చాలామంది నమ్మరు. అయితే శృతి హసన్ చిరంజీవి కొరటాల దర్శకత్వంలో త్వరలో ప్రారంభం కాబోతున్న మూవీలో నటించడానికి అంగీకరించినట్లుగా వార్తలు వస్తున్నాయి. అయితే ఈ మూవీలో శృతి హాసన్ నీరుగా హీరోయిన్ కాకపోయినా ఈసినిమాకు సంబంధించి కనిపించబోయే కీలకపాత్ర అని అంటున్నారు. 
Shruti Hassan clears air on her kissing scene in 'Welcome Back'
తెలుస్తున్న సమాచారం మేరకు కొరటాల చిరంజీవి సినిమాకు సంబంధించి వ్రాసిన కథలో ఒక ముఖ్యమైన లేడీ క్యారెక్టర్ ఉందని తెలుస్తోంది. ఈపాత్రకు హీరోతో సమానమైన ప్రాధాన్యత ఉంటుందట. నటనకు బాగా స్కోప్ ఉన్న ఈపాత్రను శ్రుతిహాసన్ చేత నటింప చేయాలని కొరటాల ప్రయత్నాలు చేస్తున్నాడు. ‘శ్రీమంతుడు’ సినిమాలో శ్రుతిహాసన్ నటించిన నాటి నుండి ఆమెకు కొరటాల పై ప్రత్యేకమైన గౌరవం ఉంది. 
Shruti Hassan 32nd Birthday: The Actor & Singer Can't Live Without Sweets. Here's Proof!
దీనికితోడు తిరిగి తెలుగు సినిమాలలో రీ ఎంట్రీ కోసం శృతిహాసన్ ఆలోచనలు ఉన్న నేపధ్యంలో సరైన ప్రాజెక్ట్ కోసం ఎదురు చూస్తోంది. ఇలాంటి పరిస్థుతులలో కొరటాల ఇచ్చిన ఆఫర్ కు శృతిహాసన్ ఖచ్చితంగా ఓకె చెప్పే ఆస్కారం ఉంది అని అంటున్నారు. 
shruti hassan in legal trouble
గత కొంత కాలంగా సినిమాలకు దూరంగా ఉంటున్న శ్రుతిహాసన్ ఈమధ్య లండన్ లో తాను పాడిన పాప్ మ్యూజిక్ ఆల్బమ్ ను విడుదల చేసి అనేక ప్రశంసలు పొందింది. ఇప్పుడు అదే స్ప్పూర్తి తో ఒక ప్రముఖ మ్యూజిక్ ఛానల్ కోసం ఈమె ఒక మ్యూజిక్ ఆల్బమ్ ను తయారు చేసే పనిలో బిజీగా ఉన్నట్లు టాక్..   


మరింత సమాచారం తెలుసుకోండి: