ఇప్పటి వరకు ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ మూవీలో నందమూరి కుటుంబ సభ్యులను చంద్రబాబునాయుడుని టార్గెట్ చేసే సీన్స్ ఉంటాయని అందరూ భావిస్తున్నారు. వాస్తవానికి ఈసినిమాలో వర్మ ఒక్క లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లకు మినహా మిగతా కుటుంబ సభ్యుల పేర్లు పూర్తిగా మార్చివేసి కేవలం ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పోలికలు బాడీ లాంగ్వేజ్ లను మాత్రమే ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ లో వర్మ చూపించబోతున్నాడు. 

ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీలో జూనియర్ ఎన్టీఆర్ పాత్రను కూడ వర్మ రేఖా మాత్రంగా చూపెట్టినట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఎన్టీఆర్ చనిపోయే సమయానికి జూనియర్ కు సుమారు పది సంవత్సరాలు మించి ఉండవు. అయితే లక్ష్మీ పార్వతిని ‘నానమ్మ నానమ్మ’ అంటూ అభిమానంగా పిలుస్తూ ఎన్టీఆర్ ఇంటిలో తిరిగే ఒక
A still from Lakshmi's NTR
మనవడి పాత్రలో జూనియర్ ఎన్టీఆర్ చిన్నప్పటి రూపాన్ని పోలిన ఒక బాల నటుడుని కూడ ఈమూవీలో వర్మ పరిచయం చేస్తున్నట్లు తెలుస్తోంది. 
ఈవిషయానికి సంబంధించి లీక్ అయిన వార్తల ప్రకారం ఎన్టీఆర్ భార్య లక్ష్మీ పార్వతిని ఆయన కుమార్తె చెంప దెబ్బ కొట్టినట్లు చూపించిన సన్నివేశంలో ఒక పది సంవత్సరాల కుర్రవాడు లక్ష్మీ పార్వతి ఎన్టీఆర్ లు కలిసి ఉన్న ఫోటోను చాలకోపంగా చింపిన ఒక సీన్ ను క్రియేట్ చేసాడట వర్మ. ఆ సీన్ లో నటించిన అబ్బాయి హరికృష్ణ కొడుకు పాత్రలో కనిపించ బోతున్న నేపధ్యంలో ఆ సీన్ లో ఉన్నది జూనియర్ మాత్రమే అన్న సంకేతాలు వచ్చేలా వర్మ సీన్ ను డిజైన్ చేసినట్లు టాక్. 

ఇప్పుడు ఈవిషయానికి సంబంధించి న్యూస్ లీక్ కావడంతో అలర్ట్ అయిన జూనియర్  ఆ సీన్ ను ఈమూవీ నుండి తొలిగించమని తారక్ కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ లోని ప్రముఖ వ్యక్తుల ద్వారా వర్మతో రాయబారాలు చేయిస్తున్నట్లు సమాచారం. దీనితో జూనియర్ రాయబారాలకు వర్మ తలొగ్గి ఆ సీన్ ను తోలిగిస్తాడా ? లేదంటే అదే సీన్ ను యధాతధంగా ఉంచుతాడా అన్న సందేహాలు కలుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: