లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదలకు ఇక కేవలం 12రోజులు మాత్రమే వ్యవధి ఉంది. ఇంకా ఈమూవీకి కీలకమైన సెన్సార్ కార్యక్రమాలు పూర్తి కావలసి ఉంది. ఇలాంటి పరిస్థుతులలో ఈమూవీ విడుదలను అడ్డుకోవడానికి మన ఉభయ రాష్ట్రాలకు చెందిన హైకోర్టులలో రెండు పిల్స్ రేపు నందమూరి కుటుంబానికి సన్నిహితుడైన ఒక ప్రముఖ లాయర్ కోర్టులో వేయబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
 బెదిరించే వాళ్లు ఏమీ చేయరని
అదేవిధంగా ఈమూవీలో తమ కుటుంబ సభ్యులకు అభ్యంతరకర సన్నివేశాలు ఉన్నాయి అంటూ ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల తరఫున ఒక లీగల్ నోటీస్ సెన్సార్ బోర్డ్ కు కూడ పంపే ఆలోచనలు కొనసాగుతున్నాయని టాక్. ఈవిధంగా అటు కోర్ట్ సమస్యలు ఇటు సెన్సార్ సమస్యలు ఒకేసారి క్రియేట్ చేసి వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను ఇరుకున పెట్టాలని నందమూరి కుటుంబ సభ్యుల వ్యూహం అని అంటున్నారు. ఇది ఇలా ఉండగా ఈవార్తలకు స్పందిస్తూ వర్మ తన సినిమాను అడ్డుకుంటే యూట్యూబ్ లో అయినా పెట్టి అనుకున్న డేట్ కు విడుదల చేస్తాను అని ప్రకటిస్తున్నాడు. 
డైరెక్టర్‌గా ఆగస్త్య పేరును అందుకే వేశాను
అయితే ఈమూవీకి సుమారు 10కోట్ల వరకు బిజినెస్ జరిగిన నేపధ్యంలో వర్మ ఆవేశంగా యూట్యూబ్ లో విడుదల చేస్తే బయ్యర్లు ఊరుకుంటారా అన్న సందేహాలు కూడ కలుగుతున్నాయి. ఇది ఇలా ఉంటే ఈసినిమాకు సంబంధించి మరో ఆసక్తికర విషయం లీక్ అయింది. ఈమూవీలో చంద్రబాబునాయుడు పై పూర్తిగా నెగిటివ్ గా లేకుండా వర్మ టార్గెట్ అంతా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల పై ఉంటుందని టాక్. 
A still from Lakshmi's NTR
లక్ష్మీ పార్వతి పై ద్వేషం పెంచుకున్న ఎన్టీఆర్ కొడుకులు కూతుళ్ళు ఆవేశంతో చంద్రబాబునాయుడును ఎన్టీఆర్ ను తప్పించి అధికారంలోకి రమ్మని ఒత్తిడి చేస్తే తనకు ఇష్టం లేకపోయినా ఎన్టీఆర్ కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని మన్నించి అయిష్టంగానే చంద్రబాబునాయుడు ఎన్టీఆర్ ను అప్పటి పరిస్థుతులలో ఎమ్ఎల్ఏ ల సహకారంతో ఎన్టీఆర్ ను అధికారం నుంచి తప్పించారు అంటూ తెలుగుదేశ వర్గాల నుండి ఎటువంటి దాడి జరగకుండా వర్మ ఈమూవీలో వ్యవహరించినట్లు వార్తలు వస్తున్నాయి. అంతేకాదు ఈ వ్య్వవహారంలో కేవలం బాలకృష్ణది ప్రేక్షక పాత్ర అనీ కుటుంబ సభ్యులలో చిన్నవాడైన బాలయ్య అప్పటి పరిస్థితులలో ఎన్టీఆర్ ను తప్పించాలి అన్న కుటుంబ సభ్యుల వాదనకు విధిలేక కలిసినట్లుగా వర్మ చూపించాడు అని అంటున్నారు. ఈవార్తలే నిజం అయితే వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కు సంబంధించి మరో కొత్త ఎత్తుగడలు వేయవలసిన అవసరం ఏర్పడుతుంది..    


మరింత సమాచారం తెలుసుకోండి: