‘కేజీ ఎఫ్’ హీరో కన్నడ రాక్ స్టార్ యష్ హత్యకు ఒక వ్యక్తి కుట్రపన్నాడు అంటూ కన్నడ మీడియాలో వచ్చిన వార్తలు కన్నడ సినీ పరిశ్రమను కొద్దిసేపు షేక్ చేసినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వార్తలు కర్ణాటక అంతా వైరల్ కావడంతో నిన్న సాయంత్రం ఈ విషయమై ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరణ ఇచ్చారు. 
హత్యకు కుట్ర అవాస్తవం
ఇక వివరాలలోకి వెళితే కర్ణాటకలో ఎన్నికల ముందు రౌడీ షీటర్లను పోలీసులు అదుపులో తీసుకొనే డ్రైవ్‌ ను నిర్వహించారు. ఆ నేపథ్యంలో ఒక కరడు గట్టిన రౌడీషీటర్‌ ను పోలీసులు అదుపులోకి తీసుకోవడంతో యష్ హత్యకు సంబంధించిన కుట్ర బయటకు వచ్చింది అంటూ కన్నడ సోషల్ మీడియా మాత్రమే కాకుండా ఎలట్రానిక్ మీడియా కూడ కొద్ది గంటలపాటు నిన్న న్యూస్ హడావిడి చేసింది. 
అంత నీచమైన వ్యక్తులు లేరు
అయితే ఈ వార్తల పై ‘కేజీ ఎఫ్’ హీరో యష్ స్పందిస్తూ ఆ వార్తలలో ఎటువంటి నిజం లేదనీ ప్రతిసారి ఎన్నికలముందు అసాంఘీక శక్తులను పోలీసులు అరెస్ట్ చేయడం సర్వసాధారణం అని అంటూ ఆకార్యక్రమంలో దొరికిన ఆ వ్యక్తి వద్ద తన ఫోటో ఉండటంతో ఇలాంటి అలజడి జరిగిందని ఇలాంటి వార్తలను దయచేసి మీడియా ప్రసారం చేయవద్దు అని యష్ ప్రకటన ఇచ్చిన తరువాత ఈ గాసిప్ లు సద్దుమణిగాయి. 
కేజీఎఫ్ భారీ విజయం
అయితే ఆ వ్యక్తి దగ్గర యష్ ఫోటో దొరకడం వెనుక మరొక కారణం ఉంది. ఆ రౌడీ షీటర్ యష్ అభిమాని అని తెలుస్తోంది. సెలెబ్రెటీల ఆరోగ్యానికి సంబంధించి అదేవిధంగా వారి బాధ్రతకు సంబంధించి ఏమైనా కొద్దిగా నెగిటివ్ వార్తలు ప్రచారంలోకి వస్తే ఆ వార్తలలోని యద్దార్ధాలు తెలుసుకోకుండా బ్రేకింగ్ న్యూస్ ల సంస్కృతి మీడియాలో పెరిగిపోవడంతో ఇలాంటి గందరగోళాలు తరుచూ జరుగుతున్నాయి..  


మరింత సమాచారం తెలుసుకోండి: