జిహ్వకో రుచి.. పుర్రెకో బుద్ది అన్నారు. అలాగే ఒక్కో వ్యక్తికి ఒక్కో అలవాటు ఉంటుంది. అవి కొన్ని సార్లు జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. సినీనటి కరాటే కల్యాణి విషయంలోనూ అదే జరిగింది. ఆమెకు చిన్నప్పటి నుంచి పేకాట అంటే మహా పిచ్చి. చాలా చిన్నప్పుడే స్కూలు మానేసి పేకాడేదట.

karate kalyani bobby dialogue కోసం చిత్ర ఫలితం 


ఆ విషయం ఆమె ఇటీవల ఓ టీవీ షోలో చెప్పింది. ఆ పేకాట వల్ల తాను అరెస్టు కూడా కావల్సి వచ్చిందట. చిన్నప్పుడు రోజూ స్కూల్‌ ఎగ్గొట్టి పేకాట ఆడటానికి వెళ్లేదట. కల్యాణి స్కూల్‌కు సరిగా రావడం లేదని మా అమ్మానాన్నలకు ఎవరో చెప్పారట. ఒకరోజు నాన్న పట్టుకున్నారు. జామ చెట్టుకు కట్టేసి కొడితే, ఒంటిపై బొబ్బలు తేలాయి.

 à°¸à°‚బంధిత చిత్రం


తాను సినిమాల్లోకి వచ్చాక ఒకసారి పేకాట ఆడి గొడవల్లో అరెస్టయ్యానని పెద్ద ఇష్యూ చేశారట. నాకు పేకాట పిచ్చే. కాదనడం లేదు. మరో పది రోజుల్లో నేను 108 గంటల పాటు హరికథా కార్యక్రమం చేస్తున్నా. దయ చేసి అర్థం చేసుకోండి అప్పుడు వారిని బతిమలాడా !

karate kalyani bobby dialogue కోసం చిత్ర ఫలితం 

అయినా వాళ్లు కావాలని ఇరికించారు అంటూ అప్పుడు జరిగిన గొడవను గుర్తు చేసుకుందావిడ. ఆ గొడవ కారణంగా సాయం చేస్తానన్న వాళ్లు కూడా వెనక్కి వెళ్లిపోయారట. చివరకు నగలు అమ్మి, 136 గంటల పాటు హరికథా ఉత్సవాలు చేస్తే లిమ్కా రికార్డు వచ్చిందని గుర్తు చేసుకున్నారు కళ్యాణి. ఆమె హరికథాకళాకారిణి కూడా మరి.


మరింత సమాచారం తెలుసుకోండి: