సినీ ఇండస్ట్రీలో  భాష, ప్రాంతం అని తేడా లేకుండా తన ఓర చూపులతో కన్నుగీటి జనాలకు నిద్ర పట్టకుండా చేసింది  ప్రియా ప్రకాశ్ వారియర్.    'ఒరు ఆదార్ లవ్' చిత్రంలో తన ప్రియుడికి కన్నుకొట్టిన సీన్ దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది. రాత్రి రాత్రే స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది ప్రియా ప్రకాశ్.  ఇక ప్రియా వారియర్ నటించిన 'ఒరు ఆదార్ లవ్'  తెలుగు లో ‘లవర్స్ డే’గా రిలీజ్ చేశారు.  అయితే ఈ చిత్రం రెండు భాషల్లో పెద్దగా హిట్ కాలేదు.  'ఒరు ఆదార్ లవ్' సినిమా రిలీజ్ కి ముందు హీరోయిన్ ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చింది.
Image result for ప్రియా వారియర్
అవకాశాలు కూడా వెతుక్కుంటూ వచ్చాయి. కానీ తన మొదటి చిత్రం మంచి హిట్ అయితే తర్వాత తన పాపులారిటీ మరింత పెరిగిపోతుందని భావించింది...ఈ నేపథ్యంలో వచ్చిన చాన్సులు అన్నీ వదులుకుంది. ఈ చిత్రం పరాజయంపాలు కావడంతో ఇప్పుడు ఒక్క ఛాన్సు కూడా లేకుండా పోయింది. పైగా ఇప్పుడు విమర్శల పాలు కావడం కొత్త ట్విస్ట్. ప్రియా వారియర్ పై సహనటి నూరిన్ చేసిన విమర్శలు మరిచిపోకముందే, దర్శకుడు ఒమర్ లులూ మరికొన్ని ఆరోపణలు చేశాడు. ఈయ‌న చేసిన కామెంట్స్ ఇప్పుడు ఇండ‌స్ట్రీని షేక్ చేస్తున్నాయి. 
Image result for ప్రియా వారియర్
షూటింగు మధ్యలో ఉండగానే ప్రియా వారియర్ కి విపరీతమైన క్రేజ్ వచ్చేసింది. దాంతో ఆమె నాకు కనీస గౌరవం కూడా ఇవ్వడం మానేసింది. ఆమె క్రేజ్ మేరకు .. ఆమె ఒత్తిడి మేరకు ఆమెకి ప్రాధాన్యతనిస్తూ కథలో మార్పులు చేర్పులు చేయవలసి వచ్చింది.  దాంతో ఈ చిత్రం అట్టర్ ఫ్లాప్ అయ్యిందని ఆరోపించారు.  స్క్రిప్ట్ ఇష్ట‌మొచ్చిన‌ట్లు మార్చేసి మొత్తానికే నాశ‌నం చేసారంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసాడు ఒమ‌ర్.  అంతే కాదు ఈ చిత్రంలో హీరోయిన్ న్యూరిన్ షరీఫ్ అని.. ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ కంటే ఆమె బెస్ట్ యాక్టర్ అని ఆయన చెప్పాడు. 


మరింత సమాచారం తెలుసుకోండి: