ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీలో తన అందాలతో కుర్రాళ్ల మతులు పోగొట్టిన హీరోయిన్ రమ్యకృష్ణ ప్రస్తుతం సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించి అత్త, అమ్మ పాత్రల్లో నటిస్తుంది.  రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి, బాహుబలి 2 చిత్రంలో శివగామి పాత్రలో రమ్యకృష్ణ నటనకు విమర్శకుల నుంచి ప్రశంసలు పొందింది.  ఈ చిత్రం తర్వాత రమ్యకృష్ణకు తెలుగు, తమిళ, మళియాళ భాషల్లో వరుసగా ఛాన్సులు రావడం మొదలు పెట్టాయి.  ఒప్పుడు హీరోయిన్ కన్నా ఇప్పుడు ఆమె బిజీ నటిగా కొనసాగుతుంది. విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలకోసం ఆమెను సంప్రదించే దర్శక నిర్మాతల సంఖ్య పెరిగిపోయింది.


అలా ఆమె తమిళంలో 'సూపర్ డీలక్స్' సినిమా చేశారు. విజయ్ సేతుపతి .. సమంత ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాలో, పోర్న్ స్టార్ గా రమ్యకృష్ణ కీలకమైన పాత్రను చేశారు. అయితే ఈ పాత్ర తనకు ఛాలెంజ్ అని తన కెరీర్ లో దిబెస్ట్ చిత్రంగా ఉంటుందని అన్నారు రమ్యకృష్ణ. ఈ సినిమాలో ఒక సీన్ కోసం 37 టేకులు తీసుకున్నారట. ఇప్పుడు ఈ విషయమే కోలీవుడ్లో హాట్ టాపిక్ గా మారింది.


తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ..కొన్ని పాత్రలు పేరు కోసం .. కొన్ని పాత్రలు డబ్బుకోసం .. మరికొన్ని పాత్రలను ప్యాషన్ తో చేస్తాము .. అలా ప్యాషన్ తో చేసిన పాత్ర ఇది అన్నారు రమ్యకృష్ణ. కుమార రాజా దర్శకత్వం వహించిన ఈ సినిమాను, మార్చి 29వ తేదీన తమిళంతో పాటు తెలుగులోను విడుదల చేయనున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: