మార్చి 22న విడుదల కాబోతున్న ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ విడుదల ఆపు చేయమని కొందరు ఎన్నికల కమీషన్ కు ఫిర్యాదు చేసి ఆ ఫిర్యాదు కాపీలను మీడియాకు విడుదల చేస్తున్నారు. ఇలాంటి పరిస్థుతులలో ఈ నెల అనుకున్న తేదీకి ఈమూవీ విడుదల సాధ్యమేనా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. 
Lakshmi's NTR
ఇలాంటి పరిస్థుతులలో ఈసినిమాను విడుదలకు ముందే ఒక వారంరోజులు ముందుగా మీడియా ప్రతినిధులకు అదేవిధంగా మేధావులు రచయితలకు ఈవారంలో హైదరాబాద్ లో ఒక ప్రీమియర్ షో వేసి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ ను ముందుగానే చూపించాలి అన్న స్కెచ్ లో రామ్ గోపాల్ వర్మ ఉన్నట్లు టాక్. తెలుస్తున్న సమాచారం మేరకు ఈ ప్రీమియర్ షో ఈ వీకెండ్ లో ఉంటుందని వార్తలు వస్తున్నాయి. 
Naidu not move court against RGV's NTR!
ఈ వార్తలు ఇలా ఉండగా ఈమూవీ సెన్సారింగ్ కార్యక్రమాలు మరో రెండు రోజులలో జరగబోతున్నట్లు తెలుస్తోంది. ఇండస్టీ విశ్లేషకుల అంచనాల ప్రకారం ఈమూవీకి సెన్సార్ ఇబ్బందులకన్నా ఎలక్షన్ కోడ్ అమలులో ఉన్న నేపధ్యంలో ఎన్నికల కమీషన్  నుంచి మాత్రమే అడ్డంకులు వచ్చే అవకాశం ఉంది అన్న ఊహాగానాలు వస్తున్నాయి.
A still from Lakshmi's NTR
అయితే ఈసినిమాలో గతంలో తెలుగుదేశం పార్టీలో జరిగిన సంఘటనల చరిత్రను మాత్రమే తాను తీసానని ప్రస్తుత ఎన్నికలకు సంబంధించి ఎలాంటి విషయాలు ఓటర్లను ప్రభావితం చేసే విషయాలు తాను ఈమూవీలో చూపించడం లేదు అంటూ వర్మ ఎన్నికల కమీషన్ తో వాదించడానికి న్యాయపరమైన సలహాలు తీసుకున్నట్లు సమాచారం. ఈ పరిస్తుతులలో వర్మ ఎన్నికల కమీషన్ తో చేయబోయే యుద్ధానికి సపోర్ట్ గా మీడియా వర్గాలు మేధావుల సహకారం తీసుకోవడానికి వర్మ ఈ ప్రీమియర్ షో ఎత్తుగడను వేసినట్లు తెలుస్తోంది..  


మరింత సమాచారం తెలుసుకోండి: