రాజమౌళి తీస్తున్న ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ కు సంబంధించి ఎటువంటి లీకులు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నా ఈమూవీ షూటింగ్ లో రాజమౌళి అనుసరిస్తున్న వ్యూహం ఇప్పుడు నెమ్మదిగా లీక్ అయింది. ఈమూవీని రాజమౌళి తెలుగు తమిళ హిందీ భాషలలో నిర్మిస్తున్న విషయం తెలిసిందే. 
SS Rajamouli,Ram Charan and Jr NTR,RRR
అయితే ఈమూవీ సీన్ కు సంబంధించిన ప్రతి డైలాగ్ ను రాజమౌళి నాలుగు సార్లు షూట్ చేస్తున్నట్లు సమాచారం. ఈమూవీలో నటిస్తున్న చరణ్ జూనియర్ లపై సన్నివేశాలు షూట్ చేసే సందర్భంలో రాజమౌళి ఈ మూవీకి సంబంధించిన డైలాగ్ లను నాలుగు మార్గాలలో చిత్రీకరిస్తున్నట్లు టాక్. 

తెలుగులో తీస్తున్న ఈమూవీ తమిళ హిందీ భాషలతో పాటు మలయాళంలో కూడ డబ్ కాబడుతోంది. ఈ నేపధ్యంలో ఆ డైలాగ్స్ కు సంబంధించి లిప్ మూమెంట్ లో ఎక్కడా ఎటువంటి తేడా రాకుండా భవిష్యత్ లో చరణ్ జూనియర్ ల పాత్రకు తమిళ హిందీ మళయాళ భాషలలో డబ్బింగ్ చెప్పే ఆర్టిస్టులకు ఎటువంటి సమస్యా లేకుండా జూనియర్ చరణ్ లతో పాటు మిగతా పాత్రలు కూడ నిజంగానే తమిళ కన్నడ హిందీ డైలాగ్స్ చెప్పిన ఫీలింగ్ కలగడానికి ఆ భాషలకు సంబంధించి పలకడంలో నిష్ణాతులైన వారి సూచనలతో ఒకొక్క డైలాగ్ నాలుగు టేకులుగా తీస్తున్నట్లు తెలుస్తోంది. 

దీనికితోడు ఈసినిమాను జపానీ భాషలో కూడ డబ్ చేసే ఆలోచనలు ఉండటంతో ఈమూవీ డైలాగ్స్ ను చరణ్ జూనియర్ ల చేత పలికించినప్పుడు జపాన్ భాషకు సంబంధించిన ఒక జపనీ డబ్బింగ్ నిష్ణాతుడుని కూడ ‘ఆర్ ఆర్ ఆర్’ షూటింగ్ స్పాట్ లో ఉంచినట్లు సమాచారం. ఇలా ఒక్క డైలాగ్ ను నాలుగు టేకులుగా రాజమౌళి తీస్తున్న నేపధ్యంలో ఈమూవీ షూటింగ్ చాల నెమ్మదిగా జరుగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇలా ఉండగా రేపు జరగబోయే ‘ఆర్ ఆర్ ఆర్’ మీడియా సమావేశానికి రాజమౌళితో పాటు జూనియర్ చరణ్ లు కూడ హాజరు అవ్వుతూ ఈమూవీకి సంబంధించిన అనేక ఆ సక్తికర విషయాలను షేర్ చేయబోతున్నట్లు సమాచారం..   


మరింత సమాచారం తెలుసుకోండి: