ఈరోజు జరిగిన ‘ఆర్ ఆర్ ఆర్’ మీడియా మీట్ అత్యంత ఆహ్లాదకర వాతావరణంలో జరిగింది. ఈసినిమాకు సంబంధించిన కధకు వివరణ ఇచ్చిన తరువాత మీడియా వర్గాల నుండి రాజమౌళికి ఊహించని షాక్ తగిలింది. ఈమూవీలో ఎన్టీఆర్ కొమరం భీమ్ రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజును పోలిన పాత్రలలో నటిస్తున్నారు అని రాజమౌళి చెప్పిన వెంటనే అతడికి మీడియా వర్గాల నుండి ఊహించని ప్రశ్న ఎదురైంది.
  తెలుగు వీరులు
కొమరం భీమ్  అల్లూరి సీతారామరాజు ఇద్దరూ బ్రహ్మచారులు అయిన నేపధ్యంలో ఈచిత్రంలో నటిస్తున్న జూనియర్ చరణ్ లకు హీరోయిన్లతో రొమాన్స్ ఎలా పెడుతున్నారు అంటూ ఒక మీడియా సంస్థ ప్రతినిధి అడిగిన ప్రశ్నకు రాజమౌళి ఊహించని షాక్ తిన్నాడు. అయితే ఆ షాక్ నుండి వెంటనే తేరుకున్న రాజమౌళి ఆ ప్రశ్న అడిగిన మీడియా ప్రతినిధిని తన తెలివితేటలతో కార్నర్ చేసాడు. 
నటులుగా మా ఇద్దరికీ ప్లస్ అవుతుంది
చరిత్రపై అనేక అభిప్రాయాలు ఉన్నాయని కొమరం భీమ్ కు ఇద్దరు భార్యలు అని కూడా చరిత్రలో ఉంది అన్న విషయం  వివరిస్తూ  అదే విధంగా  అల్లూరి సీతారామరాజుకి తన మరదలు సీతతో చిన్ననాటి నుంచే  ప్రేమ ఉందని మరికొందరు చరిత్ర కారులు తమ పుస్త కాలలో రాసిన విషయాలను వివరించాడు. అంతేకాదు తాను ‘ఆర్ ఆర్ ఆర్’ లో చెపుతున్నది అందరికి తెలిసిన కధ కాదని ఎవరికి తెలియని ఒక కధను తన ఊహతో చెపుతున్న విషయాలు వివరించాడు రాజమౌళి. 
భేషజాలు లేకుండా చరణ్ ఒప్పుకున్నాడు
ఇదే సందర్భంలో మరో మీడియా ప్రతినిధి జూనియర్ చరణ్ లను కలిపి ప్రశ్నిస్తూ సాధారణంగా ఎన్టీఆర్  రామ్ చరణ్ లకు కథ చెప్పి ఒప్పించడం కష్టం అని అంటారు. అలాంటి మీరిద్దరూ కలసి నటిస్తున్నారు ఒకవేళ రాజమౌళి కాకుండా వేరే దర్శకుడు అయితే కలసి ఇలా నటించేందుకు అంగీకరిస్తారా అనే ప్రశ్నకు ఎన్టీఆర్ సమాధానం ఇచ్చాడు. వేరే దర్శకుడు అయితే కలసి నటిస్తారా అనేది భవిష్యత్తుకు సంబంధించిన ప్రశ్న. దానికి నేను సమాధానం చెప్పలేను. కానీ ఈ చిత్రానికి మాత్రం జక్కన్న వల్లే కలసి నటిస్తున్నట్లు చెప్పి తనకు రాజమౌళి పై ఉన్న అపారమైన నమ్మకాన్ని మరోసారి బయటపెట్టాడు. ఎటువంటి సీరియస్ వాతావరణం లేకుండా అడుగడునా సరదాగా జరిగిన ఈ మీడియా మీట్ విశేషాలు ఎన్నికల వార్తలకు మించి హాట్ టాపిక్ గా మారాయి.. 
 



మరింత సమాచారం తెలుసుకోండి: