టాలీవుడ్ లోకి అసిస్టెంట్ డైరెక్టర్ గా రంగ ప్రవేశం చేసిన రవితేజ కొన్ని చిత్రాల్లో చిన్న చిన్న పాత్రల్లో నటించాడు.  పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ఇడియట్ చిత్రంతో హీరోగా మారారు.  ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన ‘విక్రమార్కుడు’ చిత్రంతో స్టార్ హీరోగా మారిపోయాడు.  ఆ తర్వాత వరుస విజయాలతో మాస్ మహారాజ గా పేరు తెచ్చుకున్నాడు.  ఇక బాబీ దర్శకత్వంలో వచ్చిన పవర్ చిత్రం తర్వాత రవితేజకు వరుస డిజాస్టర్స్ ఎదుర్కొన్నాడు.  దాంతో రెండు సంవత్సరాలు చిత్ర పరిశ్రమకు దూరంగా ఉంటూ వచ్చారు.   


 డైరెక్టర్ అనీల్ రావవిపూడి దర్శకత్వంలో ‘రాజా ది గ్రేట్ సినిమా’ రీ ఎంట్రీ ఇచ్చాడు.  ఆ తర్వాత వచ్చిన టచ్ చేసి చూడు, నేల టిక్కెట్, అమర్ అక్బర్ ఆంథోనీ చిత్రాలు వరుస డిజాస్టర్స్ అయ్యాయి.   ప్ర‌స్తుతం వీఐ ఆనంద్ తెరకెక్కిస్తున్న సైంటిఫిక్ ఫిక్షన్ మూవీ డిస్కో రాజా అనే చిత్రంలో నటిస్తున్నాడు.  ఈ సినిమా పూర్తయిన తర్వాత 'తేరి'కి రీమేక్‌గా సంతోష్ శ్రీనివాస్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు.  ఈ చిత్రానికి  కనక దుర్గ అనే టైటిల్ ఫిక్స్ చేయబోతున్నట్లు సమాచారం. 


అంతే కాదు ఈ చిత్రం తర్వాత రవితేజ కొత్త అవతారం ఎత్తుతున్నాడు రవితేజ. తన వద్ద ఉన్న కథ నందమూరి కళ్యాన్ రామ్ కి వినిపించగా కథ నచ్చడంతో సొంత బ్యానర్ లో తానే హీరోగా తీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు టాలీవుడ్ టాక్. ర‌వితేజ ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌నున్న ఈ ప్రాజెక్ట్‌పై క్లారిటీ రావ‌ల‌సి ఉంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: