ప్రముఖ దర్శకుడు రాఘవేంద్రరావు సినిమా టైటిల్స్ చూడండి.. కథ, స్క్రీన్‌ప్లే దర్శకత్వం రాఘవేంద్రరావు బి.ఎ. అని కచ్చితంగా ఉంటుంది. మరి ఈ బీఏ ఎందుకు. అదేమంత పెద్ద పేరున్న చదువు కూడా కాదు కదా. మరి ఎందుకంత గొప్పగా పెట్టుకుంటారు. ఈ విషయాన్ని ఇటీవల ఆయన ఓ ఇంటర్వ్యూలో బయటపెట్టారు.

 raghavendra rao b.a. కోసం చిత్ర ఫలితం

రాఘవేంద్రరావు ఏమన్నారంటే..

అప్పట్లో బి.ఎ. చదివిన వాళ్లకు ఏం ఉద్యోగం వస్తుంది? కనీసం డ్రైవర్‌కు ఇచ్చే శాలరీ కూడా రాదు. మొదట్లో రెండు, మూడు చిత్రాలకు రాఘవేంద్రరావు బి.ఎ. అని టైటిల్‌ వేస్తే బాగా ఆడాయి. ఒక సినిమాలో నా పేరు వెనుక డిగ్రీని పెట్టలేదు. ఎందుకు పెట్టలేదో కూడా నేను అడగలేదు.

 raghavendra rao b.a. కోసం చిత్ర ఫలితం

 

ఆ సినిమా పోయింది. అప్పుడు సెంటిమెంట్‌ అనిపించి, పబ్లిసిటీ డిజైనర్‌ ఈశ్వర్‌గారికి గుర్తు చేశా. ‘ఏవండీ నా కోరిక కాదు కానీ, సెంటిమెంట్‌గా అనిపించింది. తర్వాతి చిత్రంలో నా పేరు చివరిన బి.ఎ. యాడ్‌ చేయండి’ అని చెప్పా..  సినిమా సూపర్ హిట్  అయ్యింది.. దాంతో అలా సెంటిమెంట్ గా మారింది. అంతే.. అంటూ చెప్పుకొచ్చారు రాఘవేంద్రరావు.

 raghavendra rao b.a. కోసం చిత్ర ఫలితం

మరి మీరు బీఏ మాత్రమే చదువుకున్నారు కదా.. డైరెక్టర్ గా సక్సస్ కాకపోయుంటే ఏం చేశావారుఅని అడిగితే ఏమన్నారంటే.. డైరెక్టర్‌ను కాకపోతే.. నాకు కనీసం చెక్‌ రాయడం రాదు.. టికెట్‌ కొనుక్కోవడం రాదు.. బి.ఎ. చదివిన వాళ్లకు రూ.5వేలకు మించి జీతం ఇవ్వరు. అయితే నాకు డ్రైవింగ్‌ బాగా వచ్చు. డైరెక్టర్ కాకపోతే.. డ్రైవర్‌ అయ్యేవాడిని అంటూ తీపిగుర్తులు పంచుకున్నారు రాఘవేంద్రరావు బి.ఎ.


మరింత సమాచారం తెలుసుకోండి: