ఈ మద్య భారతీయ చిత్ర పరిశ్రమలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్న విషయం తెలిసిందే.  గత రెండు నెలల వ్యవధిలోనే తెలుగు ఇండస్ట్రీలో స్టార్ డైరెక్టర్లు విజయబాపినడు, కోడి రామకృష్ణ కన్నుమూశారు.  తాజాగా ప్రముఖ బెంగాలీ సీనియర్ నటుడు చిన్మయ్ రాయ్(79) తుదిశ్వాస విడిచారు. కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో గల స్వగృహంలో గుండెపోటుతో మరణించారు.
Veteran Actor Chinmoy Roy Passes Away
ఆయనకు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. ఆయన భార్య, నటి జుయీ బెనర్జీ కొన్నేళ్ల క్రితమే మరణించారు. జుయూ బెనర్జీని ప్రేమ వివాహం చేసుకున్నారు చిన్మయ్ రాయ్. బంగ్లాదేశ్ పరిధిలోకి వచ్చే కుమిల్ జిల్లాలో 1940లో జన్మించారు. 60వ దశాబ్ధలో ఆయన తన సినీ కెరియర్ ప్రారంభించారు. పలు హాస్య పాత్రల్లో బెంగాలీ ప్రేక్షకులను మెప్పించారు. ఒకానొక సమయంలో పలు చిత్రాల్లో ఇతని పాత్ర తప్పనిసరిగా మారింది.


మరింత సమాచారం తెలుసుకోండి: